ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

ABN, Publish Date - Jun 25 , 2025 | 12:18 AM

జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలె క్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు.

సిరిసిల్ల జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలె క్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి నార్కోటిక్‌ కంట్రోల్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించా రు. జిల్లాలో నమోదవుతున్న ఎన్‌డీపీఎస్‌ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం, నియంత్రణ చర్యలు, శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్‌ విని యోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచా రం వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలె క్టర్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలుచేయాలని సూ చించారు. జిల్లాలో కొంతమంది వస్త్ర పరిశ్రమలో పనిచేసే కార్మి కులు మద్యానికి బానిసై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నా రని, ఇలా జరగకుండా స్థానిక కౌన్సెలర్‌ల ద్వారా అవగాహన కార్యక్ర మాలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్‌ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్‌, మాదకద్రవ్యాల వల్ల కలి గే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్‌ అందించేలా చర్యలు తీసుకోవాలనీ సూచించారు. ఆసుపత్రిలో డీ అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, అవసర మైన వారికి ఇక్కడే చికిత్స అందించాలన్నారు. అటవీశాఖ అధికారులు వారి పరిధిలోని అటవీభూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్‌ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్‌ షాపులలో స్టాక్‌ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్‌ డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌కు సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో వారంరోజుల వరకు మాదక ద్రవ్యాలకు వ్యతి రేకంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు, యువతకు, ప్రజల కు, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, యువత గంజాయి డ్రగ్స్‌వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్‌ మొదటిదశలోనే కట్టడి చేయాలని, కళాశాలల యాజమాన్యాలు, విద్యా ర్థుల అలవాట్లను, నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ‘జాగ్రత్త!! మాదక ద్రవ్యాలు.. మీ జీవితాన్ని నాశనం చేస్తాయి.. డ్రగ్స్‌కు నో చెప్పండి’ అనే పోస్టర్లు రిలీజ్‌ చేశామన్నారు. ఐ యామ్‌ యాంటీ డ్రగ్స్‌ సోల్జర్‌ అనే పోస్టర్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి అంద రూ’ ఐ యామ్‌ యాంటీ డ్రగ్స్‌ సోల్జర్‌’గా నమోదు చేసుకొని మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో డీఎంహెచ్‌ వో డాక్టర్‌ రజిత, డీఏవో అఫ్జల్‌ బేగం, కార్మికశాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:18 AM