మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
ABN, Publish Date - May 23 , 2025 | 12:15 AM
జిల్లాలో మాదక ద్రవ్యా లు(డ్రగ్స్) నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలె క్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యా లు(డ్రగ్స్) నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలె క్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ మహేష్ బి గీతే, ఇతర అధి కారులతో కలిసి నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న ఎన్‌డీపీ ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖ ల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాల ను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ పాఠశాల పరిసరాల్లో ఉన్న పాన్‌షాప్ వంటి వాటి పై నిఘా పెట్టాలని అన్నారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారం భం జరిగిన తర్వాత డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చూడాలన్నారు. ప్రతి మండలంలో తహసీల్దార్, ఎంపీడీ వో, పోలీస్, మండల వ్యవసాయ అధికారి వైద్య అధికారులు పంచా యతీకార్యదర్శులతో సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందో పరిశీలించి దాని నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న బార్, వైన్‌షాప్ ప్రభుత్వ నిర్దేశిత సమయపాలన పాటించేలా చూడాల న్నారు. జిల్లాలో ఉన్న సినిమా థియేటర్ల పరిసరాలను రాత్రి సమయం లో తనిఖీలు చేయాలని, రైస్‌మిల్లులు, ఇట్టుకబట్టీల వద్ద డ్రగ్స్ నియం త్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ ప్రవీణ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జలీ బేగం, అసిస్టెంట్ లేబర్ అధికారి నాజర్ అహ్మద్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ భవాని, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష, ఎక్సైజ్, విద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 23 , 2025 | 12:15 AM