అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు
ABN, Publish Date - Jul 31 , 2025 | 12:50 AM
సోషల్ మీడి యాలో కలెక్టర్, ఉన్నతాధికారులపై జరుగుతున్న అసత్యప్రచా రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యోగుల జేఏసీ, వివిధ సంఘాల ప్రతినిధులు కోరారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : సోషల్ మీడి యాలో కలెక్టర్, ఉన్నతాధికారులపై జరుగుతున్న అసత్యప్రచా రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యోగుల జేఏసీ, వివిధ సంఘాల ప్రతినిధులు కోరారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్‌ఝాపై సోషల్ మీడియా, సామాజిక మాధ్యమంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై జిల్లా ఉద్యోగుల జేఏసీ, టీ ఎన్‌జీవోఎస్, టీజీవో, రెవెన్యూసంఘాల నాయకులు సమావేశా న్ని నిర్వహించి ఖండించారు. కలెక్టర్‌పై తప్పడు ప్రచారం చేస్తు న్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కొన్ని రోజులగా సిరిసిల్ల కలెక్టర్ పై ఫేస్‌బుక్, యూట్యూబ్ చానెల్స్‌లో అసత్య ప్రచారాలు జరుగుతున్నా యన్నారు. 13 నెలలుగా కలెక్టర్ సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్నారని ఇప్పటివరకు ఏ ఉద్యోగులను కలెక్టర్ ఇబ్బందులకు గురిచేయలేదన్నా రు. సామాజిక మాధ్యమాల్లో కలెక్టర్ అనే గౌరవం లేకుండా కలెక్టర్ ఇష్టారాజ్యంగా ఉపాఽధ్యాయులను వేధింపుల పేరిట ఇష్టం వచ్చినట్లు తప్పుడు కథనాలు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. అధికారుల ను, ఉద్యోగులను కలెక్టర్ ఎప్పుడు వేధించలేదన్నారు. మండల్లాల్లో ఎక్కడైనా ఉద్యోగులకు చిన్నచిన్న సమస్యలుంటే కలెక్టర్ సానుకూలం గా స్పందిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఉద్యోగులకు సంబంఽధం లేదని అనవసరంగా కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాగంపై దురుద్దేశం లో తప్పుడు ఆరోపణలు చేయవద్దన్నారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియమనిబంధనల ప్రకారం న్యాయంగా కలెక్టర్ విధు లు నిర్వహిస్తున్నారని, రాజ్యాంగబద్ధ విలువలను పాటిస్తున్నార న్నారు. అధారాలు లేకుండా తప్పుడు వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం సరైందికాదన్నారు. ఈ సమావేశంలో వేములవాడ ఆర్డీవో రాధాబాయ్, జిల్లా అధికా రుల అసోషియేషన్ సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జిల్లా వ్యవసా యాధికారి అఫ్జల్‌బేగం, వివిద ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతిని ధులు అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 31 , 2025 | 12:51 AM