రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:19 AM
ఎరువులను సకాలంలో రైతుల కు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : ఎరువులను సకాలంలో రైతుల కు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరే ట్‌లో బుధవారం ఎరువుల కంపెనీల ప్రతినిధులతో ఎరువుల విక్రయాలు, నిల్వ లపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన మేర స్టోరేజీ అందుబాటులో ఉందన్నారు. ప్రైవేట్‌డీలర్లకు ఖరీఫ్ సీజన్‌లో ఎంత ఎరువులు అలాట్మెంట్ ఉంది, రైతులకు ఏ మేరకు విక్రయించారు, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి డీలర్ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ ఈ-పాస్ యంత్రాల ద్వారా మాత్రమే ఎరువులను విక్రయించాలని ఆదేశించారు. బల్క్‌స్టాక్ పెట్టుకుని కృత్రిమ కొరత సృష్టించడం వంటి పనులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుం డా ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిషాప్ వద్ద స్టాక్ వివరాలను ప్రతిరోజు అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 12:19 AM