రాజకీయాలకు అతీతంగా విగ్రహ నిర్మాణం
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:33 AM
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్మించుకుందామని నాప్స్‌కాప్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు పిలుపునిచ్చారు.
గంభీరావుపేట, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్మించుకుందామని నాప్స్‌కాప్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు పిలుపునిచ్చారు. గంభీరావుపేట బీ ఆర్‌ఎస్ మండల పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో రవీందర్‌రావు మాట్లాడారు. గంభీరావుపేటలో జయశంకర్ విగ్రహ పిల్లర్‌ను కూల్చివేయడం బాధాకరమన్నారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన మహనీయుడి విగ్రహ నిర్మాణంలో రాజకీయాలు చోటు చేసుకోవడం నిజంగా చాలా విచారకరమన్నారు. విశ్వబ్రాహ్మణులు జయశంకర్ విగ్రహ నిర్మాణంలో భాగంగా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం అంద జేశారని, అందుకు అధికారులు మౌకికంగా అనుమతులు ఇచ్చి, అధికారికంగా అనుమతుల కోసం అవకాశం ఇవ్వకుండా విగ్రహ పిల్లర్‌ను కూల్చి వేయించార ని ఆరోపించారు. మహానీయుడి విగ్రహ నిర్మాణాన్ని వివాదాస్పదం చేసి, తెలం గాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ను అవమానించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో అధికారులు, రాజకీయ నాయకులు అనుభవిస్తున్న పదవులు జయశంకర్ కృషి ఫలితమేనని అన్నారు. ఇప్పటికైనా రాజకీయాలను పక్కనబెట్టి ముందుగా అను కున్న రోజునే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని వెల్ల డించారు. విశ్వబ్రాహ్మణులు మంచి ఆలోచనతో మహానీయుడి విగ్రహాన్ని నిర్మిం చడం కోసం ముందుకు రావడం శుభసూచకమన్నారు. వారికి బీఆర్‌ఎస్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ విగ్రహ నిర్మాణంలో తనవంతు సహకారం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, కొత్తపల్లి సింగిల్‌విండో చెర్మన్ సురెందర్, పట్టణ అధ్యక్షుడు పెద్దవేని వెంకటి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గంద్యాడపు రాజు, నాయకులు సురెందర్, లక్ష్మణ్, లింగమ్‌యాదవ్, రాజిరెడ్డి, మల్లేశం, శేఖర్‌గౌడ్, చారీ, వహీద్, కమలాకర్‌రెడ్డి, శంకర్ ఉన్నారు.
Updated Date - Jul 22 , 2025 | 12:33 AM