ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజకీయంగా ఎదిగితేనే రాజ్యాధికారం..

ABN, Publish Date - Jun 09 , 2025 | 12:55 AM

రాజకీయంగా ఎదిగితేనే రాజ్యాధికారం సాద్యమవుతుందని, వచ్చే స్థానిక సమరంలో ముదిరాజ్‌ల సత్తా చాటాలని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నగేష్‌, ముదిరాజ్‌ సేవా సమితి నాయ కులు విగ్రహ దాత ఆగం పాండు పిలుపునిచ్చారు.

గంభీరావుపేట, జూన్‌ 8 (ఆంద్రజ్యోతి) : రాజకీయంగా ఎదిగితేనే రాజ్యాధికారం సాద్యమవుతుందని, వచ్చే స్థానిక సమరంలో ముదిరాజ్‌ల సత్తా చాటాలని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నగేష్‌, ముదిరాజ్‌ సేవా సమితి నాయ కులు విగ్రహ దాత ఆగం పాండు పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండలం లింగ న్నపేట గ్రామంలో ఆదివారం కొరివి కృష్ణస్వామి ముదిరాజ్‌ విగ్రహ ఆవిష్కరణ, ముదిరాజ్‌ జెండా ఆవిష్కరణ, ముదిరాజ్‌ కల్యాణ మండపంను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయంగా ఐక్యతతో ముందుకు సాగితే రాజ్యా ధికారం సులభంగా సాధించవచ్చని అన్నారు. అన్ని రంగాలతో పాటు ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదగాలని, ముఖ్యంగా ముదిరాజ్‌ యువత ఆ దిశగా అడుగులు వేయా లన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో ముదిరాజ్‌లను గెలిపించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాప్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్‌ సంఘం అద్యక్షుడు చొక్క రాము, ఉపాధ్యక్షుడు తోడెటి సత్యం, మాజీ జడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్‌, ముదిరాజ్‌ సంఘం మండల అద్యక్షుడు చాత్రబోయిన లక్ష్మణ్‌, జిల్లా ఫిషరిస్‌ చైర్మన్‌ చొప్పరి రామచంద్రం, బీసీ స్టడీ సర్కిల్‌ జిల్లా డైరెక్టర్‌ జెల్లా వెంకటస్వామి, కొరివి కృష్ణస్వామి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు నారాయణరావుపేట నర్సింలు, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు శివంది దేవేందర్‌, కార్యదర్శి పెరిమెల్లి రమేష్‌, లింగన్నపేట ముదిరాజ్‌ సంఘం అధక్షుడు కొడగారి ఇస్తా రి, ముదిరాజ్‌ మండల ప్రధాన కార్యదర్శి పిట్ల బాబు, నాయకులు లింగం, గాలయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:55 AM