ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీరస్తు.. శుభమస్తు..

ABN, Publish Date - Jul 25 , 2025 | 01:06 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) శ్రావణం శుభ ముహూర్తాలను మోసుకొచ్చింది. వివాహ సందడి మొదలైంది. రెండు నెలలు జేష్ట, ఆషాఢ మాసాల్లో శుభముహూర్తాలు లేకపోవడంతో శ్రావణం కోసం ఎదురుచూసిన జంటల్లో సందడిగా నెలకొంది. శ్రావణమాసం మొత్తంగా బలమైన ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత మళ్లీ కార్తీక మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. తర్వాత మళ్లీ 2026 ఫిబ్రవరి మాఘ మాసంలోనే మంచి ముహూర్తాలు వస్తాయని పేర్కొంటున్నారు.

- జిల్లాలో వేల సంఖ్యలో పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు

- 27 నుంచి వివాహ ముహూర్తాలు

- కిటకిటలాడుతున్న వస్త్ర దుకాణాలు

- ముందస్తుగా కల్యాణ మండపాల బుకింగ్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

శ్రావణం శుభ ముహూర్తాలను మోసుకొచ్చింది. వివాహ సందడి మొదలైంది. రెండు నెలలు జేష్ట, ఆషాఢ మాసాల్లో శుభముహూర్తాలు లేకపోవడంతో శ్రావణం కోసం ఎదురుచూసిన జంటల్లో సందడిగా నెలకొంది. శ్రావణమాసం మొత్తంగా బలమైన ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత మళ్లీ కార్తీక మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. తర్వాత మళ్లీ 2026 ఫిబ్రవరి మాఘ మాసంలోనే మంచి ముహూర్తాలు వస్తాయని పేర్కొంటున్నారు. దీంతో జిల్లాలో శ్రావణంలోనే పెళ్లిళ్లు ఎక్కువగా జరుపుకోవడానికి కుటుంబాలు సిద్ధమయ్యాయి. ఈనెల 25 నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతోనే మంచి ముహూర్తాలు వస్తున్నాయి. ఈనెలలో 27,30, 31, ఆగస్టులో 1,3,4,7,8,9,10,11,13,14,15,17,18,20 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండడంతో ఎక్కువ పెళ్లిళ్లు జరపడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పాటు గృహప్రవేశాలు, పిల్లలకు కేశఖండనలు, ఉపనయనాలు, నిశ్చితార్థం, ఇతర వ్యాపార సంబంధమైన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆగస్టు 24 నుంచి భాద్రపద మాసం ప్రారంభం అవుతుండటంతో శుభకార్యాలు నిర్వహించరు. ఆశ్వయుజ, కార్తీక మాసాల వరకు ఆగాల్సిందే. జిల్లాలో పెండ్లి సందడి మొదలైంది. ఇప్పటికే ఫంక్షన్‌హాళ్ల నుంచి మొదలుకొని క్యాటరింగ్‌, కల్యాణ మండపాలు, బ్యాండ్‌ మేళాలు, పురోహితుల వరకు బుకింగ్‌లు జరిగిపోతున్నాయి. అభరణాలు, వస్త్రాల దుకాణాల్లో పెళ్లి సందడి మొదలైంది. మరోవైపు హంగామా... ఆర్భాటాలు... మూడు ముళ్ల బంధం.. మూడు తరాలు చెప్పుకునే విధంగా ఖర్చుకు వెనుకాడడం లేదు. ఎట్రాక్షన్‌ కోసం పాత కాలపు సంప్రదాయాలను చూపుతున్నారు. ప్రత్యేకతను చాటుకోవడానికి వివాహ వేడుకల్లో కొత్తకొత్త అంశాలు చేరుస్తున్నారు. వెడ్డింగ్‌ కార్డు నుంచి భోజనాల ప్లేట్ల వరకు ఏకోప్రెండ్లీని జత చేస్తున్నారు. ఇక భారీ సెట్టింగ్‌లు... సెలబ్రెటీల డ్యాన్స్‌లు... సంగీతం... అతిథులకు పోటీలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పెండ్లి ఒక పవిత్ర బంధంగా ఆరురోజుల పాటు జరిపించేవారు. ఇప్పుడు అర రోజుకు పరిమితం చేశారు. ఆకాశమంత పందిరి వేసిన పెళ్లికొడుకు బంధువులు ఇరువురు ఒకేచోట ఏదో ఒక ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లిళ్లను మాత్రం అర రోజులోనే పూర్తిచేస్తున్నారు. ఆ ఫంక్షన్‌ హాల్‌లో ఒకేరోజు రెండు పెళ్లిళ్లు ఉంటే వీరు మధ్యాహ్నంకే ఇంటిదారి పట్టే పరిస్థితి ఉంది. గతంలో పెళ్లి ఉందంటే బంధుమిత్రులందరు కలిసి వారం రోజుల పాటు ఇంట్లో సందడి చేస్తూ అందరు కలిసి వంటలు చేయడం, వంట వాళ్లు వస్తే వారికి సహాయం చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అంతా క్యాటరింగ్‌ పద్ధతే వచ్చింది.

ఫ స్టేటస్‌ సింబల్‌గా వేడుకలు

చివరకు సాంప్రదాయబద్ధంగా సాగిపోయే పెళ్లి వేడుక స్టేటస్‌ సింబల్‌గా మారింది. పెళ్లి కూతురు ధరించే దుస్తుల నుంచి ఆమెను అత్తవారింటికి పంపే వరకు, పెళ్లి కొడుకుకు కావాల్సిన వస్తువులను, మండపం అలంకరణలను ప్రతి ఒక్కటి చేసి పెట్టడానికి ఎన్నో సంస్థలు వచ్చాయి. ఇప్పుడు ఒక పెళ్లి ఖర్చు రూ 20 లక్షల నుంచి రూ.50లక్షల వరకు కూడా అవుతుంది. పెళ్లి పనులు చేసి పెట్టేందుకు మనుషులు రెడిమేడ్‌గా లభిస్తున్నారు.

ఫ మళ్లీ పల్లకీలు, గుర్రపు బగ్గీలు

పాత కాలంలో పెళ్లి కూతురును పల్లకిలో, పెళ్లికొడుకును గుర్రంపైన ఊరేగించే వారు. మధ్యలో అవి అంతరించిపోయాయి. ప్రస్తుతం పెళ్లిల్లో ప్రత్యేకతగా ఉండడం కోసం మళ్లీ పల్లకీల్లో పెళ్లి కూతురును, గుర్రం బగ్గిల్లో పెళ్లికొడుకు, పాతకాలపు జీబు, కార్లను మళ్లీ ఉపయోగంలోకి తీసుకువస్తున్నారు. మరికొందరు తెలుగు సంప్రదాయానికి భిన్నంగా ఉండడం కోసం కేరళ, గుజరాతీ పద్ధతులను కూడా ఉపయోగిస్తున్నారు.

ఫ ప్యాకేజీలతోనే పెళ్లిళ్లు

పెళ్లంటే బోలెడన్ని పనులు.. బంధువులు ఉండడానికి ఏర్పాట్లతో తల మునకలు.. భోజనాలు.. ఇతర పనులకోసం పరుగులెత్తే పరిస్థితి. ముహూర్తం రోజు దగ్గరపడితే మరీ హడావుడి. మారుతున్న కాలంతో పాటు పెళ్లి పనులు మారిపోయాయి. కూర్చున్న చోటే ఫోన్‌కాల్‌తో పనులన్నీ ప్యాకేజీ రూపంలో మ్యారెజ్‌ ప్లానర్స్‌ సిద్ధం చేసి పెడతారు. సర్వీస్‌ చార్జీ చెల్లిస్తే సరిపోతుంది. పెళ్లి వేడుకను నిర్వహించడానికి వచ్చిన సంస్థలు ఇప్పుడు కోట్లలోనే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మ్యారేజ్‌ ప్లానర్స్‌ వివిధ రకాల కళాకారులను కూడా పెళ్లిలో ఉపయోగిస్తారు. గతంలో పెళ్లిళ్లను కల్యాణ మండపాల్లోనే నిర్వహించేవారు. ఆ పరిస్థితి మారిపోయింది. మైదాన ప్రాంతంలో రకరకాల సెట్టింగ్‌లను వేస్తున్నారు. పెళ్లిల్లో మహిళలు పాటలు పాడడం డ్యాన్సులు చేయడం వంటివి నిర్వహిస్తున్నారు. వీరు మ్యారేజ్‌కు వచ్చే ఒక వ్యక్తిపై వెయ్యి రూపాయల వరకు చార్జీ చేస్తారు.

ఫ దూరమవుతున్న ఆప్యాయతలు

పెళ్లి స్టేటస్‌ సింబల్‌గా మారిపోయిన క్రమంలోనే బంధుత్వాలు కూడా దూరమైపోతున్నాయి. సమయానికి పెళ్లి వేడుకకు వచ్చి వెళ్లిపోతున్న బంధుత్వాలే కనిపిస్తున్నాయి. అక్కచెల్లెళ్ల అప్యాయతలు, అన్నదమ్ముల ఆనందాలు, బావమరదళ్ల చిలిపిమాటలు, వదినమరదళ్ల సరదాలు, మామ, తాత, బావ, మనవడు.. ఇలాంటి పిలుపులే పెళ్లిల్లో వినిపించకుండా పోతున్నాయి. లక్షలు ఖర్చు చేసి ఆర్భాటాలు చేస్తున్నా ఆప్యాయతలను మాత్రం హృదయాల్లో నిలుపుకోలేకపోతున్నారు.

ఫ ఫొటో జ్ఞాపకాలకు లక్షల్లో ఖర్చు

ప్రతి కుటుంబంలో పెళ్లి అనేది ముఖ్యమైన వేడుక ఘట్టం.. అలాంటి ముఖ్య తంతును, మధుర స్మృతులను భద్రపరిచేది ఫొటో అల్బమ్‌. ఇప్పుడు పెళ్లి పుస్తకంగా మన ముందుకు వచ్చింది. వెడ్డింగ్‌ ఫోటోగ్రఫీ ఒక ప్రత్యేకతగా నిలిచింది. ఎన్నో జ్ఞాపకాలను పెళ్లిలో చేసే సందడిని సైతం అద్భుతంగా చిత్రీకరించి ఫోటో ఆల్బమ్స్‌ రూపంలో అందిస్తున్నారు. ఒక పెళ్లి వేడుకను ముగ్గురి నుంచి ఐదుగురు ఫోటో గ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారంటే వెడ్డింగ్‌ ఫోటో గ్రఫీకి పెరిగిన క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఫ్రీ ఫొటోవెడ్డింగ్‌ షూట్‌ పేరుతో వివిధ ప్రాంతాలకు వెళ్లి వధూవరుల ఫొటోలు తీయించుకుంటున్నారు.

ఫ ఖరీదైన అల్బమ్‌లు...

పెళ్లి అల్బమ్‌ తయారీకి కేవలం వందల రూపాయల్లోనే ఉంటే ఇప్పుడు వేలల్లోకి వెళ్లింది. ఒక్క పెళ్లి వేడుక ఫోటోల అల్బమ్‌కు లక్ష నుంచి రూ.3లక్షల వరకు కూడా ఖర్చు చేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు సైతం కరిష్మా అల్బమ్‌లు 35వేల రూపాయల వరకు ఖర్చు చేసి తయారు చేయించుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన డిజిటల్‌ అల్బమ్‌లు మరీ ఖరీదైనవిగా మారాయి.

Updated Date - Jul 25 , 2025 | 01:06 AM