ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి
ABN, Publish Date - Apr 27 , 2025 | 12:14 AM
చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అన్నారు. చొప్పదండి మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం అనే కథనం ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితం కాగా మార్కెట్‌ను సందర్శించారు.
చొప్పదండి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అన్నారు. చొప్పదండి మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం అనే కథనం ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితం కాగా మార్కెట్‌ను సందర్శించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ప్రభుత్వ షెడ్లలో వ్యాపారులు నిల్వ చేసిన ధాన్యాన్ని ఖాళీ చేయించాలని ఆదేశించారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని అడుగగా హమాలీలు అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళలో పనిచేయాలని, ఎండలకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. అనంతరం ఆర్నకొండలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డీఎం రజనీకాంత్, మార్కెట్ చైర్మన్ కొత్తూరు మహేష్, తహసీల్దార్ నవీన్‌కుమార్, మార్కెట్ కార్యదర్శి రాజేశ్వరి పాల్గొన్నారు.
Updated Date - Apr 27 , 2025 | 12:14 AM