ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
ABN, Publish Date - Apr 25 , 2025 | 01:15 AM
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడంతోపాటు నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడంతోపాటు నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యాన్ని కొనుగోళ్లు చేపట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే చెల్లింపులు పూర్తిచేయాల న్నారు. జిల్లాలో ఇప్పటివరకు 246 కొనుగోలు కేంద్రాలకు 244 కొనుగోలు కేంద్రా లను ప్రారంభం చేసి కొనుగోలు కేంద్రాలనుంచి 28వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. సివిల్ సప్లయ్ డిప్యూటి తహసీల్దార్‌లు సిరిసిల్లలోని అపెరల్ పార్క్‌తోపాటు ఇతర చోట్ల తాత్కాలిక గోదాములను గుర్తించి ధాన్యాన్ని తరలిం పు చేపట్టాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు ట్యాగ్ చేసిన రైస్‌మిల్లర్లకు సామర్థఽ్యం ప్రకారం ధాన్యం కేటాయించి భద్రత కల్పించాలన్నారు. జిల్లాలో నిర్ధేశించుకున్న లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్ధాయిలో ప్రారంభించాలన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంవద్ద రెండు లారీలను అం దుబాటులో ఉంచాలన్నారు. రానున్న పది రోజుల్లో వర్షాలు లేవని వాతావరణ శాఖ వెల్లడించినందున రైతులు ఆందోళన చెందవద్దని అన్ని సెంటర్‌లల్లో కవర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో శేషాద్రి, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, పౌర సరఫరాల శాఖ అధికారులు రజిత, వసంత లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 01:17 AM