ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు

ABN, Publish Date - Aug 02 , 2025 | 12:24 AM

ఇటీవల కురిసిన వర్షాలతో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం విభాగం అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ ఆదేశించారు. శుక్రవారం లక్ష్మీనగర్‌ ప్రాంతంలో అధికారులు, సిబ్బందితో ఆయన పర్యటించారు.

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షాలతో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం విభాగం అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ ఆదేశించారు. శుక్రవారం లక్ష్మీనగర్‌ ప్రాంతంలో అధికారులు, సిబ్బందితో ఆయన పర్యటించారు. సపాయి అప్నా... బీమారీ బాగో కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. అనంతరం నీటి గుంటల్లో అధికారులతో కలిసి గంబూసియా చేపలను వదిలారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వర్షాలతో నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో నీరు నిలిచి లార్వాలు వృద్ధిచెంది దోమలు పెరుగుతాయని, పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను డివజిన్ల వారీగా చేపట్టాలన్నారు. ప్రధానంగా ఇటీవల విలీనం చెందిన గ్రామాల డివిజన్లతో పాటు నగరం మొత్తం మెరుగైన పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. వర్షపునీరు నిలిచిన చోట వాటిని డ్రైనేజీల్లోకి మళ్లించడంతో పాటు ఆ ప్రదేశాలను శుభ్రపర్చాలన్నారు. పెద్ద నీటి గుంటలు ఉన్న ప్రదేశాల్లో గంబూసియా చేపలను వదిలి చుట్టూ పరిసరాలను పరిశుభ్రం చేసి బ్లీచింగ్‌ వేయాలన్నారు. డివిజన్ల వారీగా డ్రైనేజీలను, ఖాళీ స్థలాలను శుభ్రపరిచి దోమల నివారణకు స్ర్పే, ఫాగింగ్‌ చేయాలని ఆదేశించారు. డ్రైనేజీలను, గార్బేజ్‌ పాయింట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ప్రజలకు సీజనల్‌ వ్యాధులపై అవగా హన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ వేణు మాధవ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్లు, నగరపాలక సంస్థ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌, సానిటేషన్‌ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:24 AM