ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తా

ABN, Publish Date - May 16 , 2025 | 11:56 PM

సుందరగిరి వేంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

స్వామి వారికి పట్టు తీసుకువస్తున్న వస్త్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్‌

చిగురుమామిడి, మే 16 (ఆంధ్రజ్యోతి): సుందరగిరి వేంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని సుందరగిరి గ్రామంలో గల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు నిర్వహించే స్వామి వారి రథోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ ఆలయ అభివృద్ధిపై మంత్రికి వినతిపత్రం అందించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ కమిటీ సభ్యులు ఇచ్చిన వినతిపత్రం మేరకు గుట్టపైకి రహదారి, కల్యాణ మండపం కార్యక్రమాలతో పాటు ఆలయ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందించాలని అన్నారు. సుందరగిరి గ్రామంలో గల వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులను, అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ సొల్లేటి శంకరయ్య, హుస్నాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ కేడం లింగమూర్తి, సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 11:56 PM