ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:38 AM

ప్రజా సమస్యలపై ప్రత్యేకదృష్టి సారించాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం సారంగాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేపట్టారు.

ఎస్పీ అశోక్‌కుమార్‌తో పోలీస్‌ అధికారులు

- ఎస్పీ అశోక్‌కుమార్‌ - సారంగాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

సారంగాపూర్‌, జూన్‌, 13 (ఆంధ్రజ్యోతి) ప్రజా సమస్యలపై ప్రత్యేకదృష్టి సారించాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం సారంగాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్పీకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్టేషన్‌ పరిధిలోని గ్రామాలను తరచుగా సందర్శించాలని ఆదేశించారు. పాత నేరస్తులపై ప్రత్యేకమైన నిఘా ఉంచాలని తెలిపారు. ప్రజలు, యువకులకు సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ రికార్డులను పరిశీలించి పెండింగ్‌ కేసులపై రివ్యూ నిర్వహించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్‌తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతీఒక్కరు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అంతకుముందు 1993లో మందుపాతరలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ కిష్టయ్య విగ్రహనికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేసన్‌ నిర్వహణ, ఏర్పాట్లపై ఎస్సై దత్తాద్రిని ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్‌, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, రూరల్‌ సీఐ సుధాకర్‌, ఎస్సైలు దత్తాద్రి, సధాకర్‌, కుమారస్వామి, సుధీర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:38 AM