siricilla : ’మొక్క’వోని దీక్ష..
ABN, Publish Date - Jun 23 , 2025 | 12:46 AM
(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల) మేఘం వర్షించగానే మొక్కలు పులకించే విధంగా మొక్కవోని దీక్షతో వన మహోత్సవానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఏడాది పదో విడత వన మహోత్సవాన్ని విజయవంతంగా పూర్తిచేశారు
- వన మహాత్సవానికి ఏర్పాట్లు
- జిల్లాలో 10.38 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం
- గత సంవత్సరం ఉపాధిహామీలో నాటిన మొక్కలు 6.06 లక్షలు
- జిల్లాలో 255 నర్సరీల్లో 12.26 లక్షల మొక్కలు సిద్ధం
(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)
మేఘం వర్షించగానే మొక్కలు పులకించే విధంగా మొక్కవోని దీక్షతో వన మహోత్సవానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఏడాది పదో విడత వన మహోత్సవాన్ని విజయవంతంగా పూర్తిచేశారు ఈ ఏడాది 11వ వనమహోత్సవాన్ని జూలై మొదటి వారంలో నిర్వహించే విధంగా సన్నద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని కలుపుకొని వన మహోత్సవం లక్ష్యాలను జిల్లాలోని వివిధ శాఖలకు కేటాయించారు. ఈ సంవత్సరం జిల్లాలో 10.38 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం దిశానిర్ధేశానికి అనుగుణంగానే వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమయ్యింది.
ఫ ప్రణాళిక సిద్ధం
గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖల ఆధ్వర్యంలో అన్ని శాఖలను భాగస్వాములను చేస్తూ వర్షాలు కురవడంతోనే మొక్కలు నాటడానికి ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 260 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో 14 శాఖల ద్వారా 10.38 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత పదో విడత హరితహారంలో మొక్కలు నాటడానికి 7.58 లక్షల మొక్కలు నాటే విధంగా లక్ష్యంగా పెట్టుకొని పూర్తిచేశారు. 11వ విడత హరితహారంలో జిల్లా వ్యాప్తంగా 10.38 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 255 గ్రామపంచాయతీల పరిధిలో నర్సరీల్లో 12.26 లక్షల మొక్కలను పెంచారు. నర్సరీలలో ఉన్న మొక్కలను ఆయా గ్రామాల్లో నాటనున్నారు. ఇళ్లలో నాటేందుకు పూలు, పండ్ల మొక్కలను అందించనున్నారు.
శాఖల వారీగా లక్ష్యాలు...
వనమహాత్సవ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేయడానికి జిల్లాలో ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించారు. ఈసారి 10.38 లక్షల మొక్కలు నాటే లక్ష్యంలో అత్యధికంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 6.77లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 2,08,700, వ్యవసాయ శాఖలో 25,500, అటవీ శాఖ 72,000, ఎక్సైజ్ శాఖ 27,100, విద్యాశాఖ 2 వేలు, ఉద్యానవన శాఖ 6,400, ఆర్‌అండ్‌బీ శాఖ 4 వేలు, నీటి పారుదల శాఖ 7,600, వైద్య ఆరోగ్య శాఖ 2 వేలు, పోలీస్ శాఖ 4,600, మైనింగ్ శాఖ 200, విద్యాశాఖ 2వేలు, పరిశ్రమల శాఖ వెయ్యి చొప్పున మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉపాధిహామీలోనే మొక్కల లక్ష్యం ఎక్కువ..
హరితహారంలో మొక్కలు నాటడం సంరక్షణలో ఉపాధిహామీ కిందనే ఎక్కువగా లక్ష్యాన్ని పెట్టుకుంటున్నారు. 2024-25 సంవత్సరానికి 5 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు డీఆర్‌డీఏ ద్వారా 2020-21లో 28,53,745 మొక్కలు నాటగా 27,29,701 మొక్కలు బతికున్నాయి. 2021- 2022లో జిల్లా ఉపాధిహామీ కింద 26,78,762 మొక్కలు నాటగా 25,51,234 మొక్కలు బతికి ఉన్నాయి. 2022-23 సంవత్సరంలో 19,17,248 మొక్కలు నాటగా 18,54,541 మొక్కలు బతికి ఉన్నాయి. 2023-24 సంవత్సరంలో ఉపాధిహామీ కింద 6,92,099 మొక్కలు నాటారు. ఇందులో 6,67,980 మొక్కలు బతికి ఉన్నాయి. 2024-2025 సంవత్సరంలో 6.06 లక్షల మొక్కలు నాటారు. ఈసారి 2024-26 సంవత్సరానికి 6.77 లక్షలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Updated Date - Jun 23 , 2025 | 12:46 AM