siricilla : రిజర్వేషన్ టెన్షన్
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:43 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) స్థానిక పోరు పల్లెల్లో సందడి తీసుకొస్తే ఆశా వహుల్లో, రాజకీయ పార్టీల్లో రిజర్వేషన్ల టెన్షన్ మొదలైంది. హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ చివరి వారంలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించే విధంగా అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు.
- 42శాతం బీసీల రిజర్వేషన్లు పెంచేందుకు కసరత్తు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
స్థానిక పోరు పల్లెల్లో సందడి తీసుకొస్తే ఆశా వహుల్లో, రాజకీయ పార్టీల్లో రిజర్వేషన్ల టెన్షన్ మొదలైంది. హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ చివరి వారంలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించే విధంగా అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఇదే క్రమంలో రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయనే చర్ఛ గ్రామాల్లో ప్రధానంగా మారింది. జిల్లాలో 260 సర్పంచులు, 2,268 వార్డు సభ్యులు, 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆశావహులు గ్రామాల్లో బరిలో నిలిచి పదవులు దక్కించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ నే ఉన్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కసరత్తు మొదలు పెట్టింది. కులగణన చేసి రిజర్వేషన్ల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆమోదం పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ప్రారంభించాలనే దానిపై ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రిజర్వేషన్ల ప్రక్రియ తేలితే రాజకీయ పార్టీలు సర్పంచులు, జడ్పీటీసీలు,ఎంపీటీసీల అభ్యర్థులను ఖరారు చేసే పరిస్థితి వస్తుంది. అధికా ర కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్, బీజేిపీలు రిజర్వేషన్ల ప్రక్రియపైనే దృష్టి పెట్టింది. గత ప్రభు త్వ హయాంలోని రిజర్వేషన్ల ప్రక్రియలో పంచా యతీరాజ్ చట్టంలో మార్పు తీసుకొచ్చారు. పదేళ్ల పాటు రిజర్వేషన్ కొనసాగే విధంగా తెచ్చిన రిజర్వే షన్లు మారే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్లు మించవద్దనే తీర్పు ఉంది. బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించింది. బీసీల జనాభా ఎక్కువగా ఉన్నా రాజకీయంగా వెనకబడు తున్న నేపధ్యంలో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు తొలిసారిగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. బీసీ రిజర్వేషన్లతో రాజకీయ చైతన్యంగా నాయకుల ఎదు గుదలకు తోడ్పడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సి పల్ ఎన్నికల్లో 20 శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఆ తరువాత బీసీ సంఘాలు రిజర్వేషన్ల పెంపుకోసం పోరాటాలు చేయడంతో 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి బీసీల రిజర్వేషన్ 34 శాతానికి తెచ్చారు. సుప్రీంకోర్టు రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాట కూడదని పరిమితి విధించడంతో 2019లో బీఆర్ ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 22 శాతానికి కుదించి ఎన్నికలు నిర్వహించింది. బీసీలకు అన్యాయం జరిగినా జనరల్ స్థానాల్లో సత్తా చాటారు. ఈ క్రమంలో శాసనసభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ మేరకు కులగణన నిర్వహించింది. దానికి అనుగు ణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉంటుం దనే దానిపై ఆశావహులు ఉత్కంఠగా ఉన్నారు.
ఎన్నికలపై బీసీల చూపు..
జిల్లాలో బీసీ రిజర్వేషన్లను అందిపుచ్చుకొని స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించాలనే దృష్టి మాత్రం మొదలైంది. 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ బీసీలో పోటీపడి ఉన్నత సామాజిక వర్గాల పెద్దలపై గెలుపొందారు. ఈ క్రమంలో ప్రస్తుతం సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాబోయే రిజర్వేషన్లను అందిపుచ్చుకోవడంతో పాటు జనరల్ స్థానాల్లోనూ సత్తా చాటాలని భావి స్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోటాను చట్టబద్దంగా పెంచేందుకు చిక్కుముడులు ఉండడంతో ప్రభు త్వం అచితూచి వ్యవహరిస్తోంది. ఈ సారి బీసీలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయనే అశలు మాత్రం పెరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ఐదు గ్రామ పంచాయతీలతో కలిపి 260 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహ ణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమ యంలో జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండ గా 252 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగా యి. ఈ ఎన్నికల్లో బీసీలకు 56 స్థానాలు, ఎస్సీలకు 51, ఎస్టీలకు 30, జనరల్ స్థానాలు 115 రిజర్వ్ చేశారు. ఇందులో జనరల్ స్థానాల్లో 24 మంది బీసీ లు గెలుపొందారు. 252 స్థానాల్లో బీసీ రిజర్వేషన్లు కలుపుకోని 80 మంది బీసీలు గెలుపొందారు.
జనరల్ స్థానాల్లోనూ బీసీల హవా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కూడా బీసీ లు జనరల్ స్థానాల్లో హవా చాటారు. 12 జడ్పీటీసీ స్థానాల్లో ఆరు జనరల్ స్థానాలు, బీసీలు రెండు, ఎస్సీలు మూడు, ఎస్టీలు ఒకటి రిజర్వ్ చేశారు. ఇందులో జనరల్ స్థానాల్లోనే ముగ్గురు గెలుపొం దారు. రిజర్వేషన్‌తో కలిపి ఐదుగురు బీసీలు గెలుపొందారు. 123 ఎంపీటీసీ స్థానాల్లో జనరల్ స్థానాలు 64, బీసీలకు 25, ఎస్టీలకు 6, ఎస్సీలకు 28 స్థానాలు రిజర్వ్ చేశారు. ఇందులో జనరల్ స్థానా ల్లో 17 బీసీ అభ్యర్థులు గెలుపొందారు. రిజర్వేషన్‌తో కలుపుకుని 42 ఎంపీటీసీ స్థానాల్లో మెజార్టీగా ఉన్నారు. ఈ సారి స్థానాలు జడ్పీటీసీ ఎంపీటీసీ పెరగలేదు. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ సంబం ధించిన ఏర్పాట్లు చేశారు.స్థానిక ఎన్నికల్లో సర్శంచ్, పరిషత్ ఏవి ముందు అనేదానిపై అసక్తి ఏర్పడింది.
Updated Date - Jun 30 , 2025 | 12:43 AM