ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?

ABN, Publish Date - May 19 , 2025 | 12:50 AM

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) సిరిసిల్ల, మే 17 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీ రాయితీ బకాయిలు రాకపోవడంతో స్వశక్తి పొదుపు సంఘాల మహిళలకు నిరాశే మిగులుతోంది.

- ఐదేళ్లుగా పాత వడ్డీ కోసం స్వశక్తి మహిళల ఎదురుచూపులు

- గత ప్రభుత్వ హయాంలో రూ.68.66 కోట్ల బకాయిలు

- కాంగ్రెస్‌ సర్కార్‌ కొత్త వడ్డీకే పరిమితం

- ఇప్పటికి రెండు విడతలుగా రూ.8.37కోట్లు విడుదల

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సిరిసిల్ల, మే 17 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీ రాయితీ బకాయిలు రాకపోవడంతో స్వశక్తి పొదుపు సంఘాల మహిళలకు నిరాశే మిగులుతోంది. గత ప్రభుత్వ హయాం నుంచి బ్యాంక్‌ లింకేజీ రుణాలకు సంబంధించిన వడ్డీ రాయితీ కోసం మహిళా సంఘాల సభ్యులు ఎదురుచూస్తున్నారు. తాజా కాంగ్రెస్‌ సర్కార్‌ స్వశక్తి సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించి మహిళా శక్తి పథకం ద్వారా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇదే క్రమంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళా సంఘాలకు రెండు విడతలుగా రూ.8.37 కోట్లు విడుదల చేసింది. పాత బకాయిలు కూడా ఏదో సందర్భంలో ప్రభుత్వం విడుదల చేస్తుందని స్వశక్తి మహిళలు భావించారు. అయితే ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడంతో పాత బకాయిలు లేనట్టేనా..? అనే సందిగ్ధం ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో వడ్డీ విడుదల కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా వడ్డీ రాయితీ చెల్లిస్తుందని భావించినా తమ హయాంలోని బకాయిలు మాత్రమే విడుదల చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.

ఫ బకాయిలు కోసం నిరీక్షణ

ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ రాయితీ కోసం మహిళా సంఘాల సభ్యులకు నిరీక్షణ తప్పడం లేదు. పాత బకాయిల జోలికి కొత్త ప్రభుత్వం వెళ్లకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2020-21 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ రాయితీ బకాయి రూ.68.66 కోట్లకు చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9,963 స్వశక్తి సంఘాలు, 411 గ్రామసంఘాలు, 12 మండల సంఘాలు, వీటికి అనుసంధానం చేస్లూ జిల్లా సమాఖ్య కూడా పనిచేస్తోంది. స్వశక్తి సంఘాల పరిధిలో 1,12,637 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ప్రతి సంవత్సరం కోట్లలోనే వడ్డీలేని రుణాలను అందిస్తూ గ్రామీణాభివృద్ధి సంస్థ ముందంజలో నిలుస్తోంది. స్వశక్తి సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ అందించడంలో ఇబ్బందులు లేకపోయినా వడ్డీ రాయితీ మాత్రమే భారంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో 9,755 స్వశక్తి సంఘాలకు రూ.68.66 కోట్లు వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 9,051 సంఘాలకు రూ 20.67 కోట్లు రాయితీ రావాల్సి ఉంది. 2021-22లో 9,001 సంఘాలకు రూ.25.78 కోట్లు, 2022-23లో 9,755 సంఘాలకు రూ.22.21 కోట్లు వడ్డీ రాయితీ రావాల్సి ఉంది.

మండలాల వారీగా రావాల్సిన పాత వడ్డీ రాయితీ బకాయిలు(లక్షల్లో)

మండలం 2020-21 2021-22 2022-23 సంఘాలు మొత్తం

బోయినపల్లి 178.99 209.51 177.39 792 575.89

చందుర్తి 131.73 185.57 161.73 712 479.03

ఇల్లంతకుంట 253.56 316.83 278.97 1,145 849.36

గంభీరావుపేట 230.93 288.59 285.13 1191 804.65

కోనరావుపేట 152.69 229.63 178.60 1038 560.92

ముస్తాబాద్‌ 276.82 301.01 247.12 1,124 824.95

రుద్రంగి 58.91 66.92 68.40 368 194.23

తంగళ్లపల్లి 263.75 300.97 246.70 1,145 811.42

వీర్నపల్లి 53.94 72.39 66.55 303 192.88

వేములవాడ 65.09 100.84 86.04 361 251.97

వేములవాడరూరల్‌ 113.13 130.24 118.75 544 362.12

ఎల్లారెడ్డిపేట 277.73 375.63 305.80 1,037 959.16

-----------------------------------------------------------------------------------------------------

మొత్తం 2067.27 2578.13 2221.18 9,755 6,866.58

------------------------------------------------------------------------------------------------------

Updated Date - May 19 , 2025 | 12:50 AM