siricilla : ప్రోత్సాహానికి.. నిరీక్షణ
ABN, Publish Date - Jun 13 , 2025 | 12:52 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) సన్నరకం వరి సాగు వైపు రైతులను మళ్లించే దిశగా గత వానాకాలం సీజన్ నుంచి సన్న వడ్లకు ప్రభుత్వం బోనస్ ఇస్తోంది.
- అందని సన్నరకం ధాన్యం బోనస్
- జిల్లాలో రూ 4.38 కోట్ల బోనస్ పెండింగ్
- యాసంగిలో 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
- దొడ్డు రకం 2.60 లక్షలు, సన్న రకం 8,786 మెట్రిక్ టన్నులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సన్నరకం వరి సాగు వైపు రైతులను మళ్లించే దిశగా గత వానాకాలం సీజన్ నుంచి సన్న వడ్లకు ప్రభుత్వం బోనస్ ఇస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం సన్నాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈసారి యాసంగి ధాన్యం కొనుగోల్లు జిల్లాలో పూర్తి చేసిన సన్న రకం వడ్లు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కోసం నిరీక్షణ తప్పడం లేదు. వానకాలం సీజన్లో రైతులు సన్న వడ్లను మిల్లర్లు, వ్యాపారులకు నేరుగా విక్రయించారు. ఈసారి యాసంగి సన్నరకం ధాన్యం మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. కానీ బోనస్ ఎప్పుడు వస్తుందా అని రైతులకు ఎదురుచూడక తప్పడం లేదు.
- రూ. 4.38 కోట్లు పెండింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సీజన్లో 244 కొనుగోలు కేంద్రాల ద్వారా 44,767 మంది రైతుల నుంచి రూ. 624.89 కోట్లు విలువైన 2.69 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం ధాన్యం 2.60 లక్షల మెట్రిక్ టన్నులు, సన్నరకం 8,786 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్నరకం ధాన్యంలో ఐకేపీ ద్వారా 7,291 మెట్రిక్ టన్నులు, సింగిల్ విండోల ద్వారా 1,388 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 105 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1,255 మంది రైతులు సన్నరకం బోనస్‌కు అర్హులుగా ఉన్నారు. ఇందుకు సంబంధించి బోనస్ బకాయిలు రూ 4.38 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వానాకాలం సీజన్ సాగు పనులు మొదలైన క్రమంలో సన్నరకం బోనస్ విడుదల చేస్తే పెట్టుబడికి ఉపయోగకరంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. జిల్లాలో యాసంగిలో రూ. 624.89 కోట్ల విలువైన ధాన్యాన్ని 44,767మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటివరకు రూ 582.86 కోట్లు చెల్లించారు. ప్రస్తుతం రూ 42.03 కోట్లు రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది.
- 2.43 లక్షల ఎకరాల్లో పునాస సాగు
జిల్లాలో వానాకాలంలో రెండు లక్షల 43 వేల 783 ఎకరాల్లో వివిధ పంటలు సాగుకు రైతులు పూనుకున్నారు. ఇందులో వరి లక్షా 84 వేల 860 ఎకరాలు, పత్తి 49,760 ఎకరాలు, పెసర 79 ఎకరాలు, కందులు 1,155 ఎకరాలు, జొన్నలు 14 ఎకరాలు, మొక్కజొన్న 1,600 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. వానాకాలం సాగులో జిల్లాలో
Updated Date - Jun 13 , 2025 | 12:52 AM