ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రజతోత్సవం టీఆర్‌ఎస్‌కా..? బీఆర్‌ఎస్‌కా..?

ABN, Publish Date - Apr 27 , 2025 | 12:55 AM

టీఆర్‌ఎస్‌ పార్టీకా, బీఆర్‌ఎస్‌ పార్టీకా రజతోత్స వం.. జాతీయ వాదమా, ప్రాంతీయ వాదమా అన్నది బహిరంగ సభకు వెళ్లే ముందు కేసీ ఆర్‌ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ సిరిసి ల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రె డ్డి అన్నారు.

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : టీఆర్‌ఎస్‌ పార్టీకా, బీఆర్‌ఎస్‌ పార్టీకా రజతోత్స వం.. జాతీయ వాదమా, ప్రాంతీయ వాదమా అన్నది బహిరంగ సభకు వెళ్లే ముందు కేసీ ఆర్‌ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ సిరిసి ల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రె డ్డి అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం కాం గ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. వరంగల్‌ వేదికగా నిర్వహిస్తున్న రజతోత్సవ బహిరింగ సభకు వెళ్లే ముందు కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ మా, బీఆర్‌ఎస్‌ రెండో వార్షికోత్సవ సభనా ప్రజలకు తెలపాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ జాతీయ పార్టీ అధ్యక్షుడా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడా తేల్చిచెప్పాల న్నారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిరిసిల్ల ప్రాంతంలో వడగళ్ల వానలు పడి నష్టం వాటిల్లినా రైతులు, ప్రజల కష్టనష్టాల్లో నిలబడలేదని ఆరోపిం చారు. వరంగల్‌ బహిరంగ సభ హరీష్‌రావు ఆధ్వ ర్యంలో నడుస్తుందని పత్రికా ముఖంగా కేసీఆర్‌ చె ప్పాక రాత్రికి రాత్రి కేటీఆర్‌ వచ్చాడన్నారు. బహిరం గ సభ తరువాత కుర్చీల కొట్లాటలో హరీష్‌రావు పక్కకు పోవడం ఖాయమని ప్రజలు భావిస్తున్నార న్నారు. స్కాంలలో దోచుకొని దాచుకొన్న అవినీతి సొమ్ముతో ప్రజలను సభకు తరలిస్తున్నారని ఆరో పించారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సిరిసి ల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కాముని వనితనళినీ కాంత్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, వెంకటేశం, కాసర్ల రాజు, మాజీ కౌన్సిలర్లు ఆడెపు చంద్రకళ, యెల్లె లక్ష్మీనారాయణ, కుడికాల రవికుమార్‌, కత్తెర దేవ దాస్‌, వైద్య శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 12:55 AM