లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జైలుశిక్ష, జరిమానా
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:43 AM
స్కానింగ్ సెంటర్లలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరంగా జైలుశిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : స్కానింగ్ సెంటర్లలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరంగా జైలుశిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా అధికారి డాక్టర్ రజిత అధ్యక్షతన పీసీపీఎన్‌డీటీ అడైయిజరీ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రజిత మాట్లాడారు. గర్భస్థ పూర్వ పిండ నిర్ధారణలు, బ్రూణ హత్యలు నివారించాలని, గర్భస్థ శిశువులను కాపాడల్సిన బాధ్యత అందిరిపై ఉందన్నారు. లింగనిర్ధారణ పరీక్షలను నిషేధించారని, పీసీపీఎన్‌డీటీ యాక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా నడిపే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారం వారిపై రూ.50వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ప్రతి గర్భిణీ స్కానింగ్ వివరాలను ఫామ్ ఎఫ్‌లో పొందు పరుస్తూ వారి వివరాలను రెండు సంవత్సరాల వరకు స్కానింగ్ హార్డ్ డిస్క్‌లో నిల్వ ఉంచాలన్నారు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు సరైన స్కానింగ్ రిపోర్ట్స్ గర్భిణులకు సరైన రక్తపరీక్షల రిపోర్ట్స్ ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో పీసీసీఎన్‌డీటీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి ఆల్ర్ఫెడ్, డీపీఆర్‌వో శ్రీధర్, వైద్యు లు అనిత, రామకృష్ణ, సంతప్, ఎన్జీవో అధ్యక్షుడు చింతోజు భాస్కర్, లీగర్ అడ్వ యిజర్ శాంతిప్రకాష్‌శుక్ల, ఝాన్సీలక్ష్మి, రామానుజమ్మ, డిప్యూటీ డెమో రాజకు మార్, హెచ్‌ఈ బాలయ్య, మహేష్ పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 12:43 AM