ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీనియర్‌ సిటిజన్స్‌ సమస్యలను పరిష్కరించాలి

ABN, Publish Date - May 18 , 2025 | 12:29 AM

పెండింగ్‌లో ఉన్న సీనియర్‌ సిటి జన్స్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చేపూరు బుచ్చయ్య అన్నారు.

సిరిసిల్ల టౌన్‌, మే 17 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్‌లో ఉన్న సీనియర్‌ సిటి జన్స్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చేపూరు బుచ్చయ్య అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం ఆర్డీవో కార్యాలయంలో బదిలీపై వచ్చి విధులో చేరిన ఆర్డీవో వెంకటేశ్వర్లును సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ జిల్లా సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి స్వాతగం పలుకుతూ సన్మానించారు. ఈ సంద ర్భంగా బుచ్చయ్య మాట్లాడుతూ సీనియర్‌ సిటిజన్స్‌కు సంబంధించిన కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో కు విన్నవించగా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆర్డీవో మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసి యేషన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య, ఉపాధ్యక్షుడు యేను గుల ఎల్లయ్య, కోశాధికారి దొంత దేవదాస్‌, రాష్ట్ర ఈసీ సభ్యుడు శ్రీగాధ మైసయ్య, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:29 AM