ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:53 PM
జిల్లాలో లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిచే యాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిచే యాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై జిల్లాలోని ప్రత్యేక అధికారు లతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహిం చారు. అనంతరం ఆయా మున్సిపాలిటీలు, మండలాల వారిగా లక్ష్యం మేరకు ఎంత పూర్తి చేశారో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాటాడుతూ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సర్వే చేశారని, అర్హులకే అందేలా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, మండ లాల్లో మొత్తం 7690 దరఖాస్తులు అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేశారని, వీటిలో ఇప్పటిదాకా 5776 వారి వివరాలు అన్‌లైన్ చేశారని వెల్లడిం చారు. మిగతా వివరాలు పరిశీలిస్తున్నారని పేర్కొ న్నారు. వచ్చేనెల 2న ఆయా గ్రామాలు, మున్సిపా లిటీల వార్డుల్లో దరఖాస్తుదారుల జాబితా ప్రదర్శి స్తారని, 5న తుది జాబితా ప్రదర్శిస్తారని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబా యి, డీఆర్డీవో శేషాద్రి, హౌసింగ్ పీడీ శంకర్, ప్రత్యే క అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:53 PM