సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల సీజ్
ABN, Publish Date - May 06 , 2025 | 12:06 AM
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై నగరపాలక సంస్థ దృష్టి సారించింది. నగరపాలక సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నగరంలోని టవర్‌సర్కిల్‌లో పలు వ్యాపార దుకాణాల్లో సోమవారం తనిఖీ నిర్వహించాయి.
కరీంనగర్ టౌన్, మే 5 (ఆంధ్రజ్యోతి): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై నగరపాలక సంస్థ దృష్టి సారించింది. నగరపాలక సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నగరంలోని టవర్‌సర్కిల్‌లో పలు వ్యాపార దుకాణాల్లో సోమవారం తనిఖీ నిర్వహించాయి. ఆరు షాపుల్లో దాదాపు 100 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు లభించగా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. 24 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ స్వామి మాట్లాడుతూ దుకాణాదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను అమ్మవద్దన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ ఎస్‌ఐలు వెంకన్న, శ్రీనివాస్, సర్వోత్తమ్, శ్రీధర్, డీఆర్‌ఎఫ్ మల్లేశం, మెప్మా సీవో తిరుపతి, జవాన్లు నర్సయ్య పాల్గొన్నారు.
Updated Date - May 06 , 2025 | 12:06 AM