ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేరాల విచారణలో శాస్త్రీయ ఆధారాలు కీలకం

ABN, Publish Date - Aug 02 , 2025 | 12:51 AM

నేరాల విచారణలో శాస్త్రీయ ఆధారాలు కీలకమని ఎస్పీ మహేశ్‌ బి. గీతే అన్నారు.

సిరిసిల్ల క్రైం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): నేరాల విచారణలో శాస్త్రీయ ఆధారాలు కీలకమని ఎస్పీ మహేశ్‌ బి. గీతే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాల యంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌పై అన్ని పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలు, రైటర్‌లకు మెడి కల్‌ కళాశాల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికత ఉపయోగం పెరిగిందన్నారు. కేసుల విచారణలో ఆధారాలను సైన్స్‌పరంగా విశ్లేషించడానికి ఫోరెన్సిక్‌ శిక్షణ ఎంతో అవసరం అన్నారు. నేర సంఘటన స్థలంలో ఆధారాల సేక రణ, భద్రతలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా కేసుల దర్యాప్తు లో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఆధునిక ఫోరెన్సిక్‌ పద్ధతులు విని యోగించడం ద్వారా నేరాలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చన్నారు. ఆధునిక శాస్త్రీయ విధానాల ద్వారా నేరాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు పోలీస్‌ శాఖ మరింత ప్రావీణ్యంతో ముందుకు సాగుతుందన్నారు. హత్యలు, ఆత్మహత్య లు, దొంగతనాలు, తదితర సంఘటనలో ఆధారాలు ఏవిధంగా సేకరించాలని, ఏ విధంగా భద్రపరచాలని, ఫోరెన్సిక్‌ ల్యాబరేటరికి ఏవి పంపాలనే అంశాలపై అవ గాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యబృందాన్ని ఎస్పీ అభినందించి మెమొం టోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజేశ్వరి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, డాక్టర్‌ నిర్విష, డాక్టర్‌ వినయ్‌, సీఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్‌, వీరప్రసాద్‌, శ్రీనివాస్‌, ఆర్‌ఐలు యాదగిరి, మధుకర్‌, ఎస్‌ఐలు, రైటర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:51 AM