పారిశుధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:57 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చాడ వెంకటరెడ్డి హైద రా బాద్‌లో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. దక్షణ కాశి గా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 200 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మంత్రి కొండా సురేఖకు చాడ వెంకటరెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీయూసీ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భం గా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేవస్థానంలో పనిచేస్తున్న పారి శుధ్య కార్మికులకు కాంట్రాక్టర్ ద్వారా సంగం వేతనం మాత్రమే వస్తుందని ఆ వేతనాలు కూడా గత మూడు నెలలుగా ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగులుగా గుర్తించి కార్మికులకు నెలకు రూ.26వేలు ఇవ్వా లని, ఐడీ కార్డులు, ఈఎస్‌ఐ, పీఎఫ్, హెల్త్‌కార్డులు, ప్రమాధ బీమా సౌకర్యం రూ.25లక్షలు కల్పించాలని మంత్రిని కోరారు. కార్మికులకు రోజుకు ఎనిమిద గంటల పని విధానాన్ని అమలు చేస్తూ, అదనపు పని గంటలకు అదనపు వేతనం చెల్లించాలని, రిటైర్మెంట్ తరువాత పెన్షన్ సౌకర్యల కల్పించాలని కోరారు. వేములవాడ దేవాలయానికి నిత్యం పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు సిబ్బంది ని నియమించాలని కోరారు. మంత్రికి వినతిపత్రం అందించిన వారిలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు, ప్రధాన కార్యద ర్శి కడారి రాములు, కార్మికులు వి కీతవ్వ, రేణుక ఉన్నారు.
Updated Date - Jul 27 , 2025 | 12:57 AM