ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట రూ. 40 కోట్లు స్వాహా

ABN, Publish Date - May 12 , 2025 | 12:23 AM

ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట 100 మంది వద్ద 40 కోట్ల రూపాయల వరకు డబ్బులు తీసుకుని ఏడాదిగా జాడలేకుండా పోయాడని బాధితులు ఆదివారం సప్తగిరి కాలనీలోని నిందితుడి ఇంటి వద్ద ధర్నా చేశారు.

సురేష్‌ ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న బాధితులు

కరీంనగర్‌ క్రైం, మే 11(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట 100 మంది వద్ద 40 కోట్ల రూపాయల వరకు డబ్బులు తీసుకుని ఏడాదిగా జాడలేకుండా పోయాడని బాధితులు ఆదివారం సప్తగిరి కాలనీలోని నిందితుడి ఇంటి వద్ద ధర్నా చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... సప్తగిరి కాలనీకి చెందిన మొలుగూరి సురేష్‌ స్థానికులను నమ్మించి ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌లో డబ్బులు పెడితే త్వరగా రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించాడు. ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మరికొందరికి చెప్పాడు. ఇలా 100 మంది వద్ద 40 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. కొంతకాలంపాటు డబ్బులకు వడ్డీ చెల్లించడం, ఉద్యోగం ఇచ్చిన వారికి వేతనాలు ఇచ్చాడు. అనంతరం ఎవరికీ చెప్పకుండా మాయమయ్యాడు. ఏడాది కాలంగా సురేష్‌ బాధితులకు వడ్డీ ఇవ్వడంలేదు. వేతనాలు చెల్లించడం లేదు. దీనిపై కరీంనగర్‌ టూటౌన్‌లో ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. ఇప్పటి వరకు సురేష్‌ జాడ తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - May 12 , 2025 | 12:23 AM