ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Jun 04 , 2025 | 12:29 AM

భూ సమస్యలు ఉన్న వారు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కరీంనగర్‌ మండలం దుర్శేడ్‌ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్‌ పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులో పహాణిలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమెలా సత్పతి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ రూరల్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలు ఉన్న వారు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కరీంనగర్‌ మండలం దుర్శేడ్‌ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించారు. స్వయంగా ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు, అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. రెవెన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరించిన తరువాత వారికి రశీదు ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ బారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. సదస్సులో 117 దరఖాస్తులను స్వీకరించామని తహసీల్దార్‌ రాజేష్‌ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, తహసీల్దార్‌ ఎన్‌ రాజేష్‌, డిప్యూటి తహశీల్దార్‌ వైశాలి, ఆర్‌ఐలు కనకరాజు, వాస్తవిక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:29 AM