ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - May 07 , 2025 | 12:48 AM

భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూత నంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భా గంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పిలు పునిచ్చారు.

చందుర్తి, (రుద్రంగి) మే 6 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూత నంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భా గంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పిలు పునిచ్చారు. రుద్రంగి, మానాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. రైతు లు, ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చే శారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని తెలిపారు. ఇప్ప టికే అన్ని మండలాల్లో నూతన చట్టం గురించి అవగా హన కల్పించామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రుద్రంగి మండలాన్ని పైలెట్‌ ప్రాతిపదికన ఎం పిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వ హిస్తున్నామన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ రికా ర్డులలో పేరు తప్పులు,విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారస త్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూసమస్యలు, సర్వేనంబర్‌ మిస్సింగ్‌, పట్టా పాస్‌బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూముల ను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట- బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబం ధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి కొత్త ఆర్‌.ఓ ఆర్‌ చట్టం ప్రకారం అధికారుల క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువులోపు పరిష్కరించడం జరుగు తుందని తెలిపారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికా రులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీక రిస్తారని తెలిపారు. ధరణి పోర్టల్‌ ద్వారా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చన్నారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రభుత్వపరంగా నిర్ణీ త ప్రొఫార్మాలో ప్రింట్‌ చేసిన దరఖాస్తు లను అందజేస్తారన్నారు.

ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలి..

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. మానాల కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణను ఆర్డీవో శేషాద్రితో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. సేకరిం చిన ధాన్యాన్ని వెంటవెంటనే తరలించాలని, కొనుగోళ్ల లో వేగం పెంచాలని ఆదేశించారు.

Updated Date - May 07 , 2025 | 12:48 AM