ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూ భారతితో పెండింగ్‌ సమస్యల పరిష్కారం

ABN, Publish Date - Apr 21 , 2025 | 11:48 PM

యేళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు భూ భారతి చట్టంతో పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం గంగాధర మండల కేంద్రంలో భూ భారతి కొత్త ఆర్వోఆర్‌ చట్టంపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): యేళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు భూ భారతి చట్టంతో పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం గంగాధర మండల కేంద్రంలో భూ భారతి కొత్త ఆర్వోఆర్‌ చట్టంపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఏ తప్పు చేయకుండానే రైతులను, అధికారులను దోషులుగా నిలబెట్టిందన్నారు. ధరణి లోపాలు రైతులు, అధికారుల మధ్య గొడవలు సృష్టించి రైతులు ఆత్మహత్యలకు ఉసిగొల్పాయని అన్నారు. మేధావులు, రాజకీయ నాయకులు, రైతు సంఘాల నాయకులు, అధికారులతో చర్చించి మెరుగైన ఆర్వోఆర్‌ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టు పరిధిలో భూములకు త్వరలోనే పరిహారం అందుతుందని తెలిపారు. రైతులు, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఫ సరైన మార్గదర్శకాలు లేక పేరుకు పోయిన భూ సమస్యలు

- కలెక్టర్‌ పమేలా సత్పతి

ధరణి వ్యవస్థలో సరైన మార్గదర్శకాలు లేక పొరపాట్ల సవరణకు కలెక్టర్‌కు మినహా ఏ అధికారికి అవకాశం లేదని, దీంతో వేల సంఖ్యలో సమస్యలు పేరుకుపోయాయని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. తాను విధుల్లో చేరే సమయానికి 11 వేల భూమస్యల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆరు నెలల క్రితం ప్రభుత్వం అధికారాలను విభజించడం తో దరఖాస్తులను వేగంగా పరిష్కరించామని, ప్రస్తుతం 2300 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. భూ భారతి చట్టంలో ప్రభుత్తం భూ సమస్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా పొరపాట్ల సవరణకు, అప్పీల్‌ చేసుకుని సమస్య పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. భూముల వివరాలు ప్రతి సంవత్సరం డిసెంబరులో వెల్లడవుతాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మీ కిరణ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, తహసీల్దార్‌ అనుపమ, ఎంపీడీవో రాము, ఎంపీవో జనార్దన్‌రెడ్డి, ఏడీఏ ప్రియదర్శిని, ఏవో శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జాగిరపు రజిత, సింగిల్‌ విండో అధ్యక్షుడు తిరుమల్‌రావు, ఉపాధ్యక్షుడు భాస్కర్‌ పాల్గొన్నారు.

ఫ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కురిక్యాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఆమె ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న ఆవుదుర్తి కళ్యాణి, ఆవుదుర్తి కళతో కలెక్టర్‌ మాట్లాడారు. ఏదైన సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రెండో విడత లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని, అత్యంత పేదలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అనంతరం గర్షకుర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:48 PM