పక్కాగా ఉద్యోగుల హాజరు
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:14 AM
అధికారులు, సిబ్బంది పారదర్శక సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మండల పరిషత్ కార్యాలయాల్లో ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకనుగుణంగా మండల పరిషత్ కార్యాలయాల్లో ఫేస్ రికగ్నైజేషన్ హాజరు విధానాన్ని అమలు చేసే విధంగా ప్రణాళికలు తయారుచేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై రోజుకు రెండు సార్లు ఫేస్ హాజరు నమోదు చేయనున్నారు.
భగత్‌నగర్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): అధికారులు, సిబ్బంది పారదర్శక సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మండల పరిషత్ కార్యాలయాల్లో ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకనుగుణంగా మండల పరిషత్ కార్యాలయాల్లో ఫేస్ రికగ్నైజేషన్ హాజరు విధానాన్ని అమలు చేసే విధంగా ప్రణాళికలు తయారుచేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై రోజుకు రెండు సార్లు ఫేస్ హాజరు నమోదు చేయనున్నారు.
ఫ జవాబుదారీగా ఉండేందుకు..
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులకు విన్నవించేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు నిత్యం ప్రజలు వస్తుంటారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగి వెళుతుంటారు. ప్రజలు కార్యాలయాలకు వచ్చిన రోజుల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండక పోవడం, అధికారులు కార్యాలయాల్లో ఉన్న రోజుల్లో ప్రజలు రాకపోవడంతో పనులు జరగక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవం లేదు. దీనిపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ప్రజా పాలనలో ప్రజలకు అఽధికారులు జవాబుదారీగా ఆఉండేలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం మండల పరిషత్ కార్యాలయాల్లో పేస్ రికగ్నైజేషన్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టనున్నది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది రోజుకు రెండు సార్లు హాజరు నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి. మండల పరిషత్ కార్యాలయాల్లో 10 నుంచి 15 మంది వరకు ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
Updated Date - Jul 22 , 2025 | 12:14 AM