డంపు యార్డుకు చెత్తను తగ్గించాలి
ABN, Publish Date - May 06 , 2025 | 12:12 AM
డంపు యార్డుకు చెత్తను తగ్గించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. సోమవారం నగరంలోని భగత్‌నగర్, విద్యానగర్ ప్రాంతాల్లో పర్యటించి చెత్తను వేరుచేయడంపై అపార్ట్‌మెంట్ వాసులు, మహిళలకు అవగాహన కల్పించారు. చెత్తను మూడు రకాలుగా వేరు చేయడంపై అవగాహన కల్పించారు.
కరీంనగర్ టౌన్, మే 5 (ఆంధ్రజ్యోతి): డంపు యార్డుకు చెత్తను తగ్గించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. సోమవారం నగరంలోని భగత్‌నగర్, విద్యానగర్ ప్రాంతాల్లో పర్యటించి చెత్తను వేరుచేయడంపై అపార్ట్‌మెంట్ వాసులు, మహిళలకు అవగాహన కల్పించారు. చెత్తను మూడు రకాలుగా వేరు చేయడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం చాలా వరకు డంపు యార్డుకు చెత్త వాహనాలు వెళ్లకుండా చేస్తున్నట్లు తెలిపారు. తడి చెత్త ద్వారా డంపు యార్డుకు చాలా వరకు చెత్త తగ్గుతుందని తెలిపారు. డంపు యార్డులో బయోమైనింగ్ ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తున్నామన్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంట్లో చెత్తను సెగ్రిగేషన్ చేసి తడి చెత్తను హోం కంపోస్టు చేసి, పొడి చెత్తను డీఆర్‌సీసీలకు తరలిస్తే డంపు యార్డుకు చాలావరకు చెత్త తగ్గుతుందని తెలిపారు. ప్రజలు వందశాతం సెగ్రిగేషన్‌పై దృష్టిపెట్టి చెత్తను వేరుచేసి నగరపాలకసంస్థకు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 06 , 2025 | 12:12 AM