ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మొదలైన ఎంపీటీసీల పునర్విభజన

ABN, Publish Date - Jul 11 , 2025 | 01:20 AM

వచ్చే సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిన మేరకు ప్రభుత్వం అప్రమత్తమైంది. మండల పరిషత్‌ స్థానాల పునర్విభజనకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కొద్ది రోజులకు కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి.

పెద్దపల్లి జిల్లాలో రెండు స్థానాలు తగ్గే అవకాశం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

వచ్చే సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిన మేరకు ప్రభుత్వం అప్రమత్తమైంది. మండల పరిషత్‌ స్థానాల పునర్విభజనకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కొద్ది రోజులకు కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ముగియగా, ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. గత నెలలో ప్రభుత్వం కార్పొ రేషన్లు, కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలు, వార్డులు కలపడంతో మండలాల్లో ఎంపీటీసీ స్థానాల పునర్విభజన అనివార్యమైంది. పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరించేం దుకు ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 8వ తేదీన అన్ని మండల పరిషత్‌ కార్యాల యాల్లో ముసాయిదా జాబితాను మండల పరిషత్‌ అధికారులు పబ్లిష్‌ చేశారు. మండలంలో గల ఎంపీటీసీ స్థానాలు, వాటి పరిధిలో ఉన్న గ్రామాలు, ఓటర్ల సంఖ్య, ఎస్సీ, ఎస్టీ, ఇతరుల జనాభా వివరాలతో కూడిన జాబితాను ప్రచురించారు. వాటిపై ఈ నెల 9 వరకు అభ్యంత రాలను స్వీకరించారు. 10,11 తేదీల్లో వాటిని పరిష్కరించి ఈ నెల 12న తుది జాబితాను విడుదల చేయనున్నారు.

2019లో నిర్వహించిన ఎన్నికల నాటికి జిల్లాలో 137 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం రెండు స్థానాలు తగ్గే అవకాశాలున్నాయి. జిల్లాలో 14 మండలాలకు 13 రూరల్‌ మండలాలు ఉన్నాయి. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలంలో 7 స్థానాలు, పాలకుర్తి మండలంలో 11 స్థానాలు, ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండలంలో 13 స్థానాలు, పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి మండలంలో 17 స్థానాలు, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 12 స్థానాలు, ఓదెల మండలంలో 12 స్థానాలు, సుల్తానాబాద్‌ మండలంలో 13 స్థానాలు, ఎలిగేడు మండలంలో 6 స్థానాలు, జూలపల్లి మండలంలో 9 స్థానాలు, మంథని నియోజకవర్గంలోని మంథని మండలంలో 11 స్థానాలు, ముత్తారం మండలంలో 8 స్థానాలు, కమాన్‌పూర్‌ మండలంలో 6 స్థానాలు, రామగిరి మండలంలో 12 స్థానాలున్నాయి. ప్రతి మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఫ పునర్విభజనతో తగ్గనున్న రెండు స్థానాలు

ఎంపీటీసీ స్థానాల పునర్విభజనతో జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశాలు న్నాయి. జిల్లాలో కొత్తగా గర్రెపల్లి, గుంజపడుగు, రాఘవాపూర్‌, కొలనూర్‌, జనగామ మండలాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆరు మాసాల క్రితం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌లు జిల్లా అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయించి ప్రభుత్వానికి పంపించి ఒత్తిడి తీసుకవచ్చారు. కానీ ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా మండలాల్లో ఎంపీటీసీ స్థానాల పునర్విభజన చేపట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో జగిత్యాల జిల్లాలో వెల్గటూర్‌ మండలాన్ని విభజించి ఎండపల్లి మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ మండలంలో జిల్లాలోని పాలకుర్తి మండలంలోని ముంజంపల్లి, మారేడుపల్లి, ఉండేడ గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేసిన ఎండపల్లి మండ లంలో విలీనం చేశారు. అంతకు ముందు పాలకుర్తి మండలంలో ఈ మూడు గ్రామాలు కలిపి మంజంపల్లి ఎంపీటీసీ స్థానంగా ఉండేది. దీంతో పాలకుర్తి మండలంలో గల 11 ఎంపీటీసీ స్థానాలు 10కి తగ్గనున్నాయి. ఇటీవల రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా, రామగిరి మండలం వెంకట్రావుపల్లి, పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గేట్‌, అంతర్గాం మండలం లింగాపూర్‌ గ్రామ పంచాయతీలు, కుందనపల్లి పంచాయతీ పరిధిలోని అక్బర్‌నగర్‌ గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేసి 60 డివిజన్లకు పెంచారు. దీంతో రామ గిరి మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం తగ్గనున్నది. సింగరేణి విస్తరణలో పెద్దంపేట్‌ గ్రామం కూడా ముంపునకు గురయ్యింది. అలాగే మంథని మండలంలో కన్నాల ఎంపీటీసీ స్థానంలో గల రచ్చపల్లి గ్రామ పంచాయతీ సింగరేణి ఓసీపీ 2 విస్తరణలో ముంపునకు గురైంది. ఇక్కడి నిర్వాసితులకు బిట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీని సూరయ్యపల్లి ఎంపీటీసీ స్థానంలోకి మార్చారు. దీంతో కన్నాల ఎంపీటీసీ స్థానంలో ఓట్లు తగ్గగా, ఉప్పట్ల ఎంపీటీసీ పరిధిలో గల మల్లెపల్లి గ్రామ పంచాయతీని కన్నా ల ఎంపీటీసీ పరిధిలోకి మార్చారు. మిగతా మండలాల్లో పెద్దగా మార్పులు, చేర్పులు ఏమీ జరిగే అవకాశాలు లేవు.

Updated Date - Jul 11 , 2025 | 01:20 AM