ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేషన్‌ సంబరం

ABN, Publish Date - Jul 23 , 2025 | 01:16 AM

రేషన్‌ కార్డు దరఖాస్తుదారుల ఏడేళ్ల నిరీక్షణకు ప్రభుత్వం తెరదించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈనెల 14న సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారం భించారు.

రేషన్‌ కార్డు పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రేషన్‌ కార్డు దరఖాస్తుదారుల ఏడేళ్ల నిరీక్షణకు ప్రభుత్వం తెరదించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈనెల 14న సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారం భించారు. ముఖ్యమంత్రి సోమవారం వీడి యోకా న్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లకు రేషన్‌ కార్డుల పంపిణీ జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు జిల్లా కలెక్టర్‌ ప్రజాప్రతినిధులు మండల కేంద్రాలలో అధికారికంగా రేషన్‌ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలు, కలె క్టర్‌ పాల్గొనాలని సూచనలు చేశారు. దీంతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకచోట ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పాల్గొనేలా కలెక్టర్‌ కోఆర్డినేట్‌ చేసుకోవాలని తెలిపారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం ముందస్తుగానే రేషన్‌ లబ్ధిదారుల్లో సంతోషాన్ని నింపారు. జిల్లాలో ఈనెల 17 నుంచి కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ మొద లుపెట్టారు. వేములవాడలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాలో వేములవాడ, సిరిసిల్ల, వీర్నపల్లి, ఇల్లంత కుంట మండలాల్లో లాంఛనంగా రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలో రేషన్‌ కార్డుల పంపిణీతో లబ్ధిదారుల్లో ఉత్సాహం ఏర్పడింది.

కొత్తగా 13,988 రేషన్‌ కార్డులు

జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన 16,775 దరఖా స్తులను పరిశీలించి 13,988 కొత్త కార్డులకు మం జూరు ఇచ్చారు. కొత్త కార్డులో పరిధిలో 42,623 మంది లబ్ధిదారుల ఉన్నారు. దీంతోపాటు రేషన్‌ కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం 33,616 కార్డుల్లో 45,234 మంది తమ పేర్లను కార్డులో చేర్చడానికి దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలంగా చేర్పులు, మార్పులు జరగలేదు. ఈసారి కొత్త కార్డులతో పాటు చేర్పులు, మార్పుల దరఖాస్తులను కూడా పరిశీలన పూర్తి చేశారు. కొత్తగా 31,992 దర ఖాస్తుల ద్వారా 43,097 మంది లబ్ధిదారులను కార్డుల్లో చేర్చారు. కొత్త కార్డులు, పాత కార్డుల్లో చేర్చిన లబ్ధిదారులు 74,615 మంది ఉన్నారు. జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల్లో మండలాల్లో బోయిన పల్లిలో 1,071 కార్డులు 3,137 లబ్ధిదారులు, చందు ర్తిలో 819 కార్డులు 2,469 లబ్ధిదారులు, ఇల్లంత కుంటలో 851 కార్డులు 2,593 లబ్ధిదారులు, గంభీ రావుపేటలో 911 కార్డులు 2,765 లబ్ధిదారులు, కోనరావుపేటలో 888 కార్డులు 2,787 లబ్ధిదారులు, ముస్తాబాద్‌లో 1,498 కార్డులు 4,675 లబ్ధిదారులు, రుద్రంగిలో 79 కార్డులు 244 లబ్ధిదారులు, సిరిసిల్లలో 2,632 కార్డులు 8,090 లబ్ధిదారులు తంగళ్లపల్లిలో1,406 కార్డులు 4,258 లబ్ధిదారులు, వీర్నపల్లిలో 326 కార్డులు 991 లబ్ధిదారులు, వేములవాడ రూరల్‌లో 629 కార్డులు 1,908 లబ్ధిదారులు, వేములవాడలో 1,403 కార్డులు 4,338 లబ్ధిదారులు, ఎల్లారెడ్డిపేటలో1475 కార్డులు 4,368 లబ్ధిదారులు ఉన్నారు.

సెప్టెంబర్‌ నుంచి రేషన్‌

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడు నెల ల రేషన్‌ ఒకేసారి పంపిణీ చేశారు. జూన్‌, జూలై, ఆగస్టు బియ్యం పంపిణీ పూర్తి చేశారు. జిల్లాలో కొత్తగా జారీ చేసిన 13,988 కార్డు లబ్ధిదారులతో పాటు పాత కార్డులో చేర్చిన లబ్ధిదారులు 43,097 మందికి రేషన్‌ బియ్యం కోసం సెప్టెంబర్‌ కోటా వరకు ఆగాల్సి ఉంటుంది. జిల్లాలో 345 రేషన్‌ దుకాణాలు ఉండగా 1,77,851 రేషన్‌ కార్డులు, 5,35,920 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ కార్డులు 13,748, ఆహార భద్రత కార్డులు 1,63,900, అంత్యోదయ అన్నయోజన కార్డులు 203 ఉన్నాయి. వీటి పరిధిలో లబ్ధిదారులు 5,35,920 మంది ఉన్నారు. ఇందులో అంత్యోదయ లబ్ధిదారులు 37,389 మంది, అహార భద్రత లబ్ధిదా రులు 4,98,324 మంది, అంత్యోదయ అన్నయోజన లబ్ధిదారులు 207 మంది ఉన్నారు. వీరికి మూడు నెలల కోటా 9,859.786 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారునికి ఆరు కిలోల చొప్పున మూడు నెలలకు 18 కిలోల బియ్యం ఇచ్చారు. దాదాపుగా ఒక్కో కుటుంబాలు నలుగురు ఉంటే 72 కిలోలు, ఆరుగురు ఉంటే 108 కిలోల వరకు సన్న బియ్యం వచ్చాయి.

ప్రభుత్వ పథకాలకు తొలగిన ఆటంకం

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందాలంటే రేషన్‌ కార్డు తప్పనిసరి కావడంతో కొన్నేళ్లుగా కార్డు లేక సంక్షేమ పథకాలకు అనేక మంది దూరం అయ్యారు. కనీసం కార్డులో చేర్పు లు, మార్పులకు కూడా అవకాశం లేకుండా పోయింది. 2018లో నిలిచిపోయిన రేషన్‌ కార్డుల ప్రక్రియతో ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యాస్‌ సబ్సిడీ, ఉచిత కరెంట్‌, గ్యారంటీ పథకాలు అందుకోలేక పోయారు. కొత్త కార్డులు అందిం చడంతో ప్రభుత్వ పథకాలు పొందడానికి ఉన్న ఆటంకం తొలగిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 23 , 2025 | 01:16 AM