అర్హులంందరికీ రేషన్‌కార్డులు మంజూరు
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:54 AM
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పెగడపల్లి, జులై 26 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం పెగడపల్లి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండలానికి నూతనంగా మంజూరైన రేషన్ కార్డు ప్రొసీడింగ్ పత్రాలను, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి కార్డుదారుకు సన్న బియ్యం అందించడంతో పాటు ప్రతి కుటంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరన్, మార్కెట్ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సునీత, తహసీల్దార్ బి.రవీందర్, ఎంపీడీవో ఎ.శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం సమత, రెవెన్యూ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ మండల నాయకులు , వివిద శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2025 | 12:54 AM