ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజన్న కోడెల మృతి కలిచివేసింది

ABN, Publish Date - Jun 06 , 2025 | 12:46 AM

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి గోశాలకు చెందిన కోడెల మృతి తనని ఎంతగానో కలిచివేసిం దని ప్రభుత్వ విప్‌, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

వేములవాడ కల్చరల్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి గోశాలకు చెందిన కోడెల మృతి తనని ఎంతగానో కలిచివేసిం దని ప్రభుత్వ విప్‌, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న ఆలయ తిప్పాపూర్‌ గోశాలను ఈవో వినోద్‌రెడ్డి, వైద్యబృందం తో కలిసి పరిశీలించి కోడెల ఆరోగ్య వివరాలు వైద్య అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇటీవల కొన్ని కోడెలు అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమని, ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్‌రెడ్డి కోడెల మరణాల విషయంలో వాకబ్‌ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను పంపిం చారని తెలిపారు. పశుసం వర్థక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌, ఆలయ ఈవో, సిబ్బందితో పాటు అన్నివిభాగాల అధికారులు కోడె లను నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. సీజనల్‌ వ్యాధులు, అనారోగ్యంతోపాటు కొన్ని కోడెలకు లంపిస్కిన్‌ వ్యాధివచ్చినట్లు వైద్యాధికారులు తెలిపార న్నారు. 16మంది వైద్యసిబ్బంది కోడెలను పర్యవేక్షిస్తు న్నారని అన్నారు. దాదాపు 18నుంచి 20కోడెలు అనా రోగ్యం నుంచి కోలుకుని ఆర్యోగంగా ఉన్నట్లు తెలి పారు. వేములవాడలో విశాలమైన గోశాలను నిర్మా ణం చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పంచారని అన్నారు. కోడెమొక్కు భక్తుల విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక అని రాజన్న ఆలయ కోడెలపై రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. మొదటి దశలో సుమారుగా ఒక వెయ్యి కోడెలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు సమర్పించే కోడెలలో కొన్నింటికి లంపీ స్కిన్‌ వ్యాధి ఉండటంతో ఇతర కోడెలకువ్యాపించినట్లు అధికారులు తెలిపారని వివరించారు.భక్తులు సమర్పించే కోడెలను పదిరోజులపాటు క్వారంటైన్‌లో పెట్టి తరవాత మిగతా వాటితో కలిపే విధంగా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈవో వినోద్‌రెడ్డి, పశువైద్యాధికారులు కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

గోశాలను సందర్శించిన కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

తిప్పాపూర్‌ గోశాలలోని కోడెలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వాటికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా ఆదేశించారు. తిప్పాపూర్‌లోని గోశాలను గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గోశాల ఆవరణలో పారిశుధ్య పనుల కోసం అదనంగా వర్కర్లను నియమించేందుకు ఉద్యోగ ప్రకటన జారీ చేశామని, కోడెల సంరక్షణకు పకడ్జందీగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోడెలకు అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోశాలలో నిర్వహణ స్వయంగా పరిశీలించారు. కోడెలకు మెరుగైన దాణా, పచ్చిగడ్డి, తాగు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఈవో వినోద్‌రెడ్డి, పశువైద్యబృందం, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులు రాధా కిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 12:46 AM