ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం

ABN, Publish Date - May 29 , 2025 | 12:25 AM

ఇప్పటికే రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతీ రుతుపవనాలతో జిల్లాలో మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వానాకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. జిల్లాలో ఈ సీజన్‌లో 3,43,240 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది.

- 3,43,240 ఎకరాల్లో పంటల సాగు

- 2,76,500 ఎకరాల్లో వరి, 48 వేల ఎకరాల్లో పత్తి

- వెయ్యి ఎకరాల్లో పప్పు దినుసులు

- కూరగాయలు, ఉద్యానవన సాగు 13,045 ఎకరాలు

- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన వ్యవసాయశాఖ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఇప్పటికే రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతీ రుతుపవనాలతో జిల్లాలో మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వానాకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. జిల్లాలో ఈ సీజన్‌లో 3,43,240 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. ప్రధాన పంట వరిని 2,76,500 ఎకరాల్లో, పత్తిని 48 వేల ఎకరాల్లో, మొక్కజొన్నను నాలుగు వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. వెయ్యి ఎకరాల్లో కంది, 200 ఎకరాల్లో పెసర, వెయ్యి ఎకరాల్లో మిర్చి, 150 ఎకరాల్లో వేరుశెనగ, 13,045 ఎకరాల్లో కూరగాయలు, ఇతర హార్టికల్చర్‌ సాగును చేస్తారని అంచనా వేశారు. 300 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తారని భావిస్తున్నారు.

ఫ ఎరువులు, విత్తనాలకు ఏర్పాట్లు

3,43,240 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసే రైతన్నలు అధిక ఉత్పత్తి సాధించడానికి ఈ పంటల కోసం 43,254 మెట్రిక్‌ టన్నుల యూరియా, 26,957 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌, 7,730 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ, 6,945 మెట్రిక్‌ టన్నుల డీఏపీ వినియోగిస్తారని వ్యవసాయశాఖ అంచనా వేశారు. అందుకు అనుగుణంగా స్టాక్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. 69,125 క్వింటాళ్ల వరి విత్తనాలు, 320 క్వింటాళ్ల మొక్కజొన్న, 30 క్వింటాళ్ల కందులు, 16 క్వింటాళ్ల పెసర, 90 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు, 88,162 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయని అంచనావేసింది. ఈ మేరకు వాటిని అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 16,809 మెట్రిక్‌ టన్నుల యూరియా, 31,076 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌, 2,593 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 4,836 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అవసరాన్నిబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఎరువులు తెప్పించేందుకు జిల్లా వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రధానంగా ప్రతి యేటా పత్తి విత్తనాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఆసరా చేసుకుని వ్యాపారులు ఆ విత్తనాలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తారు. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది.

ఫ బీటీ-3 పత్తి విత్తనాలపై నిషేధం

బీటీ-3 పత్తి విత్తనాలను వాడవద్దని, ఈ విత్తనాలను సాగు చేస్తే పర్యావరణం దెబ్బతింటుందని వ్యవసాయశాఖ చెబుతున్నది. దేశంలో ఈ పత్తిని సాగు చేసేందుకు అనుమతి లేదు. బీటీ-3, బీజీ-3 విత్తనాలను హెర్బిసైడ్‌ టాలరెంట్‌ విత్తనాలుగా పేర్కొంటారు. ఈ విత్తనాలు గ్లైఫోసిన్‌ కలుపు మందును తట్టుకుని ఉండేలా జన్యుమార్పిడి చేసిన రకాలకు చెందినవి. ఈ విత్తనాలను సాగు చేస్తే కలుపు మందు కొట్టినా మొక్క చనిపోదని అందుకోసమే రైతులు దీన్ని సాగుచేసి అవసరానికి మించిన కలుపు మందును కొడతారు. దీంతో పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బతింటుందని వ్యవసాయశాఖ చెబుతుంది. ఈ విత్తనాల సాగుతో పత్తి మొక్క, కలుపు మొక్కల మధ్య క్రాసింగ్‌ జరిగి కలుపు మందును తట్టుకునే జన్యువులు కలుపు మొక్కలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని దాంతో అది సూపర్‌వీడ్‌గా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఫ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి బీటీ-3 విత్తనాలు...

పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి బీటీ-3 పత్తి విత్తనాలు తీసుకువచ్చి ప్రతి యేటా విక్రయిస్తున్నారు. వెయ్యి రూపాయలకు కిలో విత్తనాలను విక్రయిస్తున్నారు. విత్తనాలను విక్రయించేవారు నేరుగా గ్రామాలకు వచ్చి రైతులను కలిసి విత్తనాలను, కలుపు మందయిన గ్లైపోసెట్‌ను అమ్ముతున్నారు. పురుగుల మందు షాపుల్లో కూడా ప్రభుత్వం నిషేధించిన గ్లైపోసెట్‌ మందును గుట్టు చప్పుడు కాకుండా విక్రయించడం ప్రతియేటా జరుగుతున్నది. ఈ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటున్నా రైతులు వాటి సాగుపై మొగ్గు చూపడంతో బీటీ-3 పత్తి సాగు యథేచ్ఛగా సాగుతున్నది.

Updated Date - May 30 , 2025 | 03:08 PM