ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:38 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు గురువారం పాఠశాల దుస్తులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.

విప్‌ ఆది శ్రీనివాస్‌ చేతుల మీదుగా తన కూతురు అడ్మిషన్‌ తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నరేష్‌

- రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

చందుర్తి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు గురువారం పాఠశాల దుస్తులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా ముందుకుపోతున్నారన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో డైట్‌ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్‌ చార్జీలు 200 శాతం పెంచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారం అందించడానికి ఒకే మెనూ తయారుచేసి అందిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు చెప్పేది వింటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టామన్నారు. శిక్షణ తరగతులు విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతీ పేద విద్యార్థికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్లో నిర్మాణం కోసం 200 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సైతం ఇంటర్నేషనల్‌ స్థాయిలో విద్య అందిస్తున్నామన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్స్‌ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థు లు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి తల్లిదండ్రుల ఆశయాల ను నెరవేర్చాలన్నారు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం మొదలు కాకముందే రాష్ట్రం లోని ఆయా పాఠశాలల్లో విద్యార్థు లకు దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచామని తెలిపారు.

- ఉపాధ్యాయుడికి అభినందన

మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కాపిళ్ల నరేష్‌ తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతిలో చేర్పించి విప్‌ చేతుల మీదగా అడ్మిషన్‌ పొందారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడై ఉండి తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం పట్ల నరేష్‌ను ప్రభుత్వ విప్‌ అభినందించారు. ఉపాధ్యా యులందరూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడా నికి కృషి చేయాలన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:38 AM