ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తరుగులేకుండా ధాన్యం కొనుగోలు

ABN, Publish Date - Apr 19 , 2025 | 12:28 AM

ధాన్యంలో ఎలాంటి తరుగులేకుండా కొనుగోలు చేస్తున్నామని, సన్నవడ్లు పండించే రైతాంగానికి క్వింటాలుకు ఐదు వందల చొ ప్పున బోనస్‌ ప్రకటించడంతో రాష్ట్రంలోనే పెద్దపల్లి నియోజకవర్గ రైతులు అత్యధికంగా సాగు చేశారని, రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువగా బోనస్‌ పొందారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.

భూపతిపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే విజయరమణారావు

- సన్నవడ్లకు బోనస్‌తో రాష్ట్రంలోనే పెద్దపల్లిలో అత్యధిక సాగు

- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 18: (ఆంధ్రజ్యోతి): ధాన్యంలో ఎలాంటి తరుగులేకుండా కొనుగోలు చేస్తున్నామని, సన్నవడ్లు పండించే రైతాంగానికి క్వింటాలుకు ఐదు వందల చొ ప్పున బోనస్‌ ప్రకటించడంతో రాష్ట్రంలోనే పెద్దపల్లి నియోజకవర్గ రైతులు అత్యధికంగా సాగు చేశారని, రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువగా బోనస్‌ పొందారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ మండంలోని నారాయణరావు పల్లి, గొల్లపల్లి, సాంబయ్యపల్లి, ఐతరాజుపల్లి, భూపతిపూర్‌, గర్రెపల్లి, బొంతకుంటపల్లి,నర్సయ్యపల్లి, నీరుకుళ్ల, గట్టేపల్లి, కదంబాపూర్‌, తొగర్రాయి తదితర గ్రామాల్లో సహకార సంఘం, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మె ల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు రాష్ట్రవ్యాప్తంగా సన్నవడ్లు పండించిన రైతులకు 1,234 కోట్ల రూపాయలు అందివ్వగా ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలో అత్యధి కంగా 59 కోట్ల 15 లక్షల రూపాయలు బోనస్‌ ఇచ్చార న్నారు. కార్యక్రమాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ మిను పాల ప్రకాశ్‌రావు, పన్నాల రాములు, సింగిల్‌ విండో చైర్మన్లు జూపల్లి సందీప్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్‌, కోటవీ ణ రాజు, డీపీఎం నాగేశ్వర్‌రావు, ఏపీఎం గీత, నాయకులు పాల్గొన్నారు.

ఓదెల: ధాన్యంలో ఎలాంటి కోతలేకుండా కొనుగోలు చేస్తున్నామని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండలంలోని కొలనూర్‌, ఓదెల, ఉప్పరపల్లి, గోపరపల్లి, హరిపురం, నాంసానిపల్లి గ్రామాల్లో ఐకేపీ, సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ ఆళ్ల సుమన్‌రెడ్డి, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ గోపు నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి బైరి రవిగౌడ్‌, మాజీ సర్పంచ్‌లు బొంగోని రాజయ్య, సామ శంకర్‌, విజయేందర్‌రెడ్డి, గుండేటి మధు, ఆకుల మహేందర్‌, గుండేటి ఐలయ్య, అసంశెట్టి కృష్ణ, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దు

పాలకుర్తి (ఆంధ్రజ్యోతి): రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులకు విక్రయించి మోసపోవద్దని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ సూచించారు. శుక్రవారం మండలంలోని బసంత్‌నగర్‌, పాలకుర్తి, గుంటూరుప ల్లి, ఎల్కలపల్లి, కొత్తపల్లి, రామరావుపల్లి, ఈసాలతక్కళ్లపల్లి, పుట్నూర్‌, గుడిపెల్లి, జయ్యారం, కుక్కలగూడూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..యాసంగిలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. సన్న వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్‌ ఇస్తుందన్నారు. అనంతరం జయ్యారం గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. కార్యక్రమంలో రామగుండం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం తిరుపతి, మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్‌గౌడ్‌, కన్నాల పీఏసీఎస్‌ చైర్మన్‌ బయ్యపు మనోహర్‌రెడ్డి, డీసీసీ ప్రధానకార్యదర్శి సూర సమ్మయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్‌గౌడ్‌, మక్కాన్‌సింగ్‌ సేవ సమితి చైర్మెన్‌ మనాలి ఠాకూర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:28 AM