ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
ABN, Publish Date - Jun 29 , 2025 | 12:23 AM
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్యేల్యే ఆది శ్రీని వాస్ అన్నారు.
రుద్రంగి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్యేల్యే ఆది శ్రీని వాస్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో శనివారం కల్యాణలక్ష్మి చెక్కులు, సీఎంఆర్‌ఎప్ చెక్కులను లబ్ధిదారు లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు ప్రభుత్వ తరపున అందిస్తున్నామన్నారు. రైతులకు ఏకకాలంలో రూ. 21 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. అలాగే రుద్రంగిని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఏంపీడీవో నాటరాజ్, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, ఎర్రం గంగన ర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, గండి నారాయణ, మాడిశెట్టి అభిలాష్, కెసిరెడ్డి నర్సరెడ్డి, తర్రె లింగం, బైరి గంగమల్లయ్య, స్వర్గం పరందామ్, పల్లి గంగాధర్, ఎర్రం రాజలింగం, సూర యాదయ్య, గండి ఆశోక్, పూదరి మహిపాల్, చెలుకల శ్రీకాంత్, వంగ మనోజ్, నారావేణి నర్స య్య, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 29 , 2025 | 12:24 AM