ప్రజలకు మెరుగైన సేవలందించాలి
ABN, Publish Date - May 07 , 2025 | 11:18 PM
ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని కార్యాలయాలను ఆయనతనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో కులం, ఆదాయం, సర్టిఫికేట్ల జారీ, పెండింగ్ మ్యూ టేషన్లు, రేషన్‌కార్డుల జారీప్రక్రియ, భూ సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గంగాధర, మే 7 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని కార్యాలయాలను ఆయనతనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో కులం, ఆదాయం, సర్టిఫికేట్ల జారీ, పెండింగ్ మ్యూ టేషన్లు, రేషన్‌కార్డుల జారీప్రక్రియ, భూ సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పరిశీలించి శిథి లావస్థకు చేరగా కొత్తకార్యాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీచేసి ప్రజాపాలనలో వచ్చి దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపిక వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జాగిరపు రజిత, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు వేముల భాస్కర్, నాయకులు పురమల్ల మనోహర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్, నియోజకవర్గ అధ్యక్షుడు యగ్నేష్, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - May 07 , 2025 | 11:18 PM