ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పెట్రోల్‌ బంక్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు

ABN, Publish Date - Jul 17 , 2025 | 12:51 AM

మెప్మా ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా ఆదేశించారు.

వేములవాడ టౌన్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మెప్మా ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా ఆదేశించారు. వేములవాడ మండల పరిధిలోని మారుపాక గ్రామ శివారులో సర్వే నంబర్‌ 339లో ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని బుధవారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్థలం హద్దులు సిద్ధంచేయాలని, మెప్మా ఆధ్వర్యంలో మహిళ సంఘాల సభ్యులు పెట్రోల్‌బంక్‌ నిర్మాణ ఏర్పా టుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి కింద మహిళ సంఘాల సభ్యులు ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వారి వెంట మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, డీటీసీపీఓ అన్సార్‌ తదిత రులు ఉన్నారు.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డెస్క్‌ బెంచీలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో గ్యాస్‌ కనెక్షన్‌లు అందుబాటులోకి రానున్నట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా తెలిపారు. మండలంలోని మారుపాక గ్రామంలోని అంగన్‌వాడీ ప్రైమరీ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉండ టా న్ని గమనించి శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శి, ప్రధానో పాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. బడిబాట కార్యక్ర మంలో ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రైమరీ స్కూల్లోని తరగతి గదిలో విద్యార్థుల బెంచీలు సరైన క్రమంలో ఏర్పాటుచేసి వారికి వీలైనంత సువిశాల గదిని కేటాయించాలని, రంగులు వేయించాలని సూచిం చారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డెస్క్‌ బెంచీలు లేకపోవడం గమనించి వెంటనే ఇతర పాఠశాలల్లో అధికంగా ఉన్న వాటిని ఇక్కడి తెప్పించే ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలకు సరైన ప్రహరీ ఉపాధిహామీ కింద నిర్మించాలని అధికారులను ఆదేశించారు. విద్యాల యంలోని 8,9,10 తరగతుల విద్యార్థులకు సైన్స్‌, సోషల్‌, మాథ్స్‌ పాఠా లు బోధించారు. విద్యార్థులను ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు సరైన విధంగా విద్యాబోధన చేయాలసిందిగా ఉపాధ్యా యులకు ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లల బరువును చెక్‌ చేశారు. పాఠశాల పరిసరాలు మొత్తం కలియతిరిగి పరిశుభ్రం చేయిం చాలని తెలిపారు. అంగన్‌వాడీ భవనం వాటర్‌ లీకేజీ లేకుండా వెంటనే బాగు చేయించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని వంటగదిని ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కాగా, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశాల మేరకు మండలంలోని మారుపాక ప్రభుత్వ పాఠశాలలో డెస్క్‌బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలను బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేసిన కొద్దిపాటి గంటల్లోనే విద్యార్థులకు డెస్క్‌బెంచీలను తెప్పించారు. విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి సమస్య పరిష్క రించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 17 , 2025 | 12:51 AM