స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి
ABN, Publish Date - Jul 20 , 2025 | 01:03 AM
స్థానిక సంస్థల ఎన్నిక లకు సన్నద్ధం కావాలని ఎస్పీ మహేష్ బి.గీతే అన్నారు.
సిరిసిల్ల క్రైం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నిక లకు సన్నద్ధం కావాలని ఎస్పీ మహేష్ బి.గీతే అన్నారు. శని వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికా రులందరూ కృషి చేయాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవ హరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పని చేయాలని తెలిపారు. ప్రాసిక్యూషన్‌లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితు లపై, తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై పకడ్బందీగా అమ లుచేయాలనలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పెట్రోలిం గ్, బ్లూ కోల్ట్స్ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రద్దీగల ప్రాంతా ల్లో, ప్రధాన కూడళ్ళ వద్ద గస్తీకాస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉండాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదా ర్థాలు, మట్కా, జూదంలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయిని రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమా ద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడు పుతూ,ర్యాష్ డైవ్రింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారి గురిం చి నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి పట్టుబడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు తలెత్తుతున్న సమస్యలకు తక్షణమే స్పందించి సత్వర సేవలందించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి కేటాయించబడిన పెట్రోకార్, బొలెరో వాహనాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన పెట్రోకార్, బొలెరో వాహ నాలను తనిఖీచేసి వాటి నిర్వహణ పరిస్థితిపై సమగ్ర సమాచారం తెలుసు కొని,వాహనాలు ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉండేలా చూసుకోవడం ద్వారా అనుకోని సంఘటనలు జరిగిన సందర్భాల్లో తక్షణమే స్పందించి సకాలంలో ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈసమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మధుకర్, నాగేశ్వరరావు, నటేష్, ఆర్‌ఐలు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్‌ఐలు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 20 , 2025 | 01:03 AM