ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్య ద్వారానే పేదరికాన్ని అధిగమించవచ్చు

ABN, Publish Date - Jul 27 , 2025 | 12:55 AM

విద్య ద్వారా మాత్రమే పేదరికాన్ని అధిగమించవచ్చని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు.

ఇల్లంతకుంట, జూలై 26(ఆంధ్రజ్యోతి) : విద్య ద్వారా మాత్రమే పేదరికాన్ని అధిగమించవచ్చని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి శనివారం రహీంఖాన్‌పేట గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ విద్యాసంస్థలలో పోటీపరీక్షలకు సన్నద్దులను చేయడానికి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ తరగతుల్లో దేశంలోని నిపుణులైప విద్యావేత్తలతో బోధన జరుగుతుందన్నారు. ఢిల్లీలోని విద్యార్థులు పొందే శిక్షణ ఇప్పుడు సాంకేతికతను వినియోగించుకొని సిరిసిల్ల జిల్లాలోని పిల్లలకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ తరగతులలో విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. కాలిక్యులస్‌, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌, ఎలకో్ట్ర మ్యాగ్నటిసమ్‌లాంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం విద్య,వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మాడల్‌ స్కూల్‌లోని సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెలవు రోజుల్లోని కొద్ది సమయాన్ని చదువుకోసం వెచ్చించాలని సూచించారు. విద్యార్థులు సమస్యలు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకరావాలని సూచించారు. విద్యుత్‌ మోటార్‌ కావాలని కోరగా నిధులు మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా విద్యార్థులకు కలెక్టర్‌ పాఠాలు బోధించారు. కిచెన్‌షెడ్‌ను పరిశీలించి, విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందివ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వినోద్‌కుమార్‌, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్‌ ఫారూఖ్‌, ఎంపీడీఓ శశికళ, మండల విద్యాధికారి చెప్యాల శ్రీనివాస్‌గౌడ్‌, ప్రిన్సిపాల్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 12:55 AM