మల్లన్న క్షేత్రంలో ఘనంగా పూజలు
ABN, Publish Date - Mar 17 , 2025 | 12:37 AM
ప్రసిద్ధ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ఘనం గా పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్త్తులు ఒగ్గు పూజారులతో పట్నాలు వే యించారు.
- పట్రాలు వేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
ఓదెల, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ఘనం గా పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్త్తులు ఒగ్గు పూజారులతో పట్నాలు వే యించారు. అలాగే మల్లన్నను దర్శించుకొని పూజలు ని ర్వహించారు. కోడెలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులను సమర్పించారు. పెద్దపల్లి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు.
జూలపల్లి మల్లన్న ఆలయంలో..
కమాన్‌పూర్: మండలంలోని జూలపల్లి గ్రామంలో గల పర్వతాల మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివా రం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామివారికి పట్నాలువేసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిం చుకున్నారు. ఆలయ ఆవరణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ ఎలాబోయిన కు మార్, వైస్‌చైర్మన్ ఎలాబోయిన అమ్మక్క తిరుపతి, చిన్న తిరుపతి, శ్రీశైలం చర్యలు చేపట్టారు. కార్యక్రమం లో బాలకుమార్, మల్లేష్, ఒగ్గుపూజారులు పాల్గొన్నారు.
Updated Date - Mar 17 , 2025 | 12:37 AM