నిండుకుండలా చెరువులు
ABN, Publish Date - Jul 25 , 2025 | 12:13 AM
రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని వివిద గ్రామాల్లో చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండి మత్తడి పడుతున్నాయి.
మానకొండూర్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని వివిద గ్రామాల్లో చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండి మత్తడి పడుతున్నాయి. మండలంలో 17 చెరువులు, 80కిపైగా కుంటలు ఉన్నాయి. ఇవి పూర్తి స్థాయిలో నిండితేనే గ్రామాల్లోని ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఈ సారు వర్షాలు ఆలస్యంగా కురవడంతో వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాతావరణం పూర్తిగా చల్లబడింది. చెరువులు, కుంటలు నిండుకుండల్లా కనిపించడంతో రైతులు సంతోషం వ్వక్తం చేస్తూ సాగుకు సిద్దం అవుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాలలోని చెరువులు మత్తడి పడుతూ జళకళను సంతరించుకున్నాయి. గ్రామాల్లో వరినాట్లు ఊపందు కోవడంతో వ్యవసాయ కూలీలకు చేతి నిండా పని లభిస్తోంది.
ఫ శంకరపట్నం: శంకరపట్నం మండలం ముత్తారం రామసముద్రం చెరువు రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మత్తడి దూకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు.
Updated Date - Jul 25 , 2025 | 12:13 AM