బస్టాండ్‌లో భద్రతపై పోలీసుల దృష్టి
ABN, Publish Date - Apr 27 , 2025 | 12:16 AM
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో భద్రతపై పోలీసులు దృష్టి పెట్టారు. ప్రయాణికుల పర్సులు, సెల్‌ఫోన్‌లు, బ్యాగులు తరుచుగా చోరీ జరుగుతుండటంతో ఒకటి రెండు రోజుల్లో పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటు చేయనున్నట్లు సీసీ గౌస్ ఆలం ప్రకటించారు. పదేళ్ల క్రితం బస్టాండ్‌లో పోలీస్‌అవుట్ పోస్టు ఉండేది. ప్రయాణికులకు ఏ సమస్య వచ్చినా, మహిళలకు వేధింపులు ఎదురైనా వెంటనే అవుట్‌పోస్ట్‌లోని పోలీసులను ఆశ్రయించేవారు. అక్కడికక్కడే న్యాయం, పరిష్కారం జరిగేది.
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో భద్రతపై పోలీసులు దృష్టి పెట్టారు. ప్రయాణికుల పర్సులు, సెల్‌ఫోన్‌లు, బ్యాగులు తరుచుగా చోరీ జరుగుతుండటంతో ఒకటి రెండు రోజుల్లో పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటు చేయనున్నట్లు సీసీ గౌస్ ఆలం ప్రకటించారు. పదేళ్ల క్రితం బస్టాండ్‌లో పోలీస్‌అవుట్ పోస్టు ఉండేది. ప్రయాణికులకు ఏ సమస్య వచ్చినా, మహిళలకు వేధింపులు ఎదురైనా వెంటనే అవుట్‌పోస్ట్‌లోని పోలీసులను ఆశ్రయించేవారు. అక్కడికక్కడే న్యాయం, పరిష్కారం జరిగేది. అయితే 10 సంవత్సరాల నుంచి అవుట్ పోస్ట్ లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఒక దొంగ బస్టాండ్‌లో ఒక వృద్ధుడి బ్యాగ్‌లో నుంచి 13 లక్షలు దొంగిలించాడు. మరో రెండు సంఘటనల్లో విలువైన వస్తువులు, బంగారం చోరీకి గురయ్యాయి. పాత నేరస్థులు, జైలు నుంచి విడుదల అయిన దొంగలు ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసుల కాపలా లేదని తెలుసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. అయితే ఆర్టీసీ బస్టాండ్‌లో ఇటీవల చిన్న చిన్న దొంగతనాలు, ఇతర ఘటనలు ఎక్కు వవటంతో పోలీస్‌కమిషనర్ దీనిపై దృష్టి సారించారు. ఒకటి రెండు రోజుల్లో ఆర్టీసీ బస్టాండ్‌లో 24 గంటలపాటు పోలీసుల నిఘా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
బస్టాండ్‌ను సందర్శించిన ఏసీపీ
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌ను కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంటకస్వామి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ప్లాట్‌ఫాం, ఇన్‌గేట్, అవుట్ గేట్‌లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించారు. అనంతరం బస్టాండ్‌లోని కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించారు. ప్రతి రోజు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటంతో పాటు వాటిని సమర్ధవంతంగా నిర్వహించాలని ఆర్టీసీ అధికారులకు, సిబ్బందికి ఏసీపీ సూచించారు.
Updated Date - Apr 27 , 2025 | 12:16 AM