ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రణాళికాబద్ధంగా ఆలయ విస్తరణ పనులు

ABN, Publish Date - May 23 , 2025 | 12:19 AM

వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

వేములవాడ టౌన్‌, మే 22 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ మండల పరిషత్‌లో మున్సిపల్‌ పరిధిలోని 484 మందికి ఇందిరమ్మ రెండవ విడుత ఇళ్ల మంజూరు ఉత్తర్వులను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో కలిసి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు మొదటి విడుతలో ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. గతంలో అనేకసార్లు దరఖాస్తు చేసు కున్నప్పటికి నిరుపేదలకు ఇళ్లు మంజూరు కాలేదని అన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత నియోజకవ ర్గంలో కొన్ని వేల కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదగా శంకుస్థాపన చేశా మని తెలిపారు. గతంలో పాలకులు వేములవాడ రాజన్న ఆలయానికి ప్రతి యేటా రూ.100 కోట్లు విడుదల చేస్తామని ప్రగల్భాలు పలికి ఆలయం అభివృద్ధికి నోచుకో లేదని అన్నారు. వర్షకాలం ముగిసిన తరువాత మూడో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామన్నారు. గుడిచెరువులో మురుగునీరు కలువకుండా, మూలవాగు శుభ్రం చేయ డానికి 9 కోట్ల రూపాయల ఖర్చుతో నివారణ చర్యలు చేపట్టామని అన్నారు. వేముల వాడ ఆలయ విస్తరణ పకడ్బందీగా చర్యలు చేపట్టామన్నారు. ఆలయం మూసివేస్తా మని లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆది శ్రీనివాస్‌ సూచించారు. ప్రతి నిత్యం స్వామివారికి పూజలు జరుగుతాయన్నారు. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తూ, ప్రజ లకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 400 నుంచి 600 అడుగుల లోపు నిర్మాణం జరుగుతే నాలుగు దశల్లో గ్రీన్‌ చానల్‌ ద్వారా రూ.5 లక్షల సహాయం అందిస్తామని అన్నారు. బేస్‌మెంట్‌ దశలో రూ.లక్ష, గోడల నిర్మాణ సమయంలో రూ.లక్ష స్లాబ్‌ దశలో రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత మరో లక్ష రూపాయలు అందిస్తామని అన్నారు. ఇంటి స్థలం లేని నిరుపేదలకు కూడా రెండవ దశలో ఇళేకల తప్పకుండా ఇస్తామని, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని అన్నారు. ప్రభుత్వం తరపున ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

భూమిలేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు..

- కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

భూమిలేని నిరుపేదలకు అసంపూర్తిగా ఉన్న డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను పూర్తి చేసి అందించేందుకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి ప్రణాళిక రూపొందిస్తున్నామని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వు పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రాబోయే రోజుల్లో భూమి లేని నిరుపేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చర్యలు తీసుకుంటుందన్నారు. వేముల వాడ పట్టణ పరిధిలో గురువారం పంపిణీ చేసిన 484 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు 30రోజుల్లో ప్రారంభించాలని సూచించారు. ఇంటి నిర్మాణంలో పేదలకు పూర్తి సహకారం అందిస్తామని, పెట్టుబడి లేని పేదలకు లక్ష రూపాయలు స్వయం సహాయక మహిళ సంఘాల ద్వారా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో పీడీ హౌసింగ్‌ శంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజు, వైస్‌చైర్మన్‌ కనికరపు రాకేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:19 AM