నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ABN, Publish Date - Aug 04 , 2025 | 01:01 AM
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నీటి కోసం ప్రజలందరు ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ఆరోపించారు.
సిరిసిల్ల రూరల్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నీటి కోసం ప్రజలందరు ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ఆరోపించారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు నీళ్లు రాని ప్రాంతాలకు ట్యాంకర్‌లతో నీటిని సరఫ రా చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్ లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో అదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్ మాట్లాడుతూ సిరిసిల్లలో గత రెండు రోజుల నుంచి మిషన్ భగీరఽథ నీళ్లు రావడం లేదన్నారు. నీటి కోసం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులతో పాటు సాన్నాలు చేయడానికి సైతం నీళ్లు లేకుండాపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రెండు రోజుల నుంచి నల్లాలలో నీళ్లు రాకపోవడంపై మున్సిపల్ అధికారులకు సమాచారం అందిస్తే పైప్‌లైన్ పగిలిపోయిందని అది మరమ్మతులు చేయ డానికి మూడు రోజులుపడుతుందని చెబుతున్నారని అన్నారు. మున్సి పల్ కమిషనర్ స్పందించి ట్యాంకర్‌లతో అన్ని వార్డులల్లో నీటి సరఫరా చేసి ప్రజలకు నీటి కష్టాలను తీర్చాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కోడం రమణ, నాయకులు నక్క దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 04 , 2025 | 01:01 AM