మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తేవాలి
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:47 AM
ప్రజల్లో మూఢ నమ్మకాలపై చైతన్యం తీసుకవచ్చేందుకు రాష్ట్ర ప్ర భుత్వంతో పాటు మేధావులు, ఉపా ధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని దాశరథి అవార్డు గ్రహీత, తెలంగాణ రచయితల వేధిక జాతీయ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం కోరా రు.
సిరిసిల్ల రూరల్, జూన్ 20 (ఆంధ్ర జ్యోతి) : ప్రజల్లో మూఢ నమ్మకాలపై చైతన్యం తీసుకవచ్చేందుకు రాష్ట్ర ప్ర భుత్వంతో పాటు మేధావులు, ఉపా ధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని దాశరథి అవార్డు గ్రహీత, తెలంగాణ రచయితల వేధిక జాతీయ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం కోరా రు. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ కుసుమ రామయ్య జిల్లాపరిషత్ ఉన్న త పాఠశాలలో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా స్ధాయి కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు సిలివేరి సంపత్‌కుమార్ అఽధ్యక్షతన జరిగింది. ఈ సమా వేశంలో సభ్యత్వం నమోదు, చెకుముకి మాస ప్రతికకు చందారులను పెంచడం, శాస్ర్త్రీయ దృ క్పథం పెంపొందించడానికి జూలైలో చేపట్టే కా ర్యక్రమాలను రూపకల్పన చేశారు. ఈనెల 22న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశా నికి తరలివెళ్లాలని నిర్ణయించి తీర్మానాలు చేశా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జూకంటి జగన్నాథం మాట్లాడుతూ సమాజంలో విద్యా, విజ్ఞానం, సమాచారం అందుబాటులో ఉన్న నేటి కాలంలో ప్రజల్లో ప్రశ్నించేతత్వం లోపిస్తోందన్నారు. దీనివలన అనేక అంధ విశ్వా సాలు, మూఢనమ్మకాలు పెరిగిపోయి ప్రజల్లో సంకుచిత భావాలు పెరుగుతూ ఉన్నా యని అన్నారు. వీటి నుంచి ప్రజలను బయట పడేయాలంటే మేధావి వర్గం ఉపాధ్యాయులు, విద్యావంతులు కూడా ఏకమై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వాలు సైతం దీని పై ముందుకు రావాలన్నారు. గత 35 సంవత్సరాలుగా జనవిజ్ఞాన వేదిక నుంచి ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం నెలకొల్పడంలో అవిశ్రాంతంగా కృషి చేయడం అభినందనీయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మార్వాడి గంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పారం లక్ష్మీనారాయణ, సంపతి రమేష్, గుర్రం అంజ నేయులు, బుర్క గోపాల్, తౌటు మధుసుధన్, మోడపట్ల కిషన్, గొర్రె రాజలింగం, పాకాల శంకర్‌గౌడ్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 12:47 AM