peddapally : నేడు మంత్రుల పర్యటన
ABN, Publish Date - Jun 13 , 2025 | 12:54 AM
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) జిల్లాలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన నాలుగు పోలీస్‌స్టేషన్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు.
- నాలుగు పోలీస్‌స్టేషన్ల ప్రారంభం
- రూ.4.25 కోట్లతో సమీకృత కూరగాయల మార్కెట్
- 484 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూముల ఇళ్లు పంపిణీ
- మంత్రులు దుద్దిళ్ల, పొంగులేటి రాక
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన నాలుగు పోలీస్‌స్టేషన్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. 24 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2001 జూన్ 1వ తేదీన 57వ మండలంగా ఎలిగేడు ఏర్పాటైంది. ఆ సమయంలో పలు ప్రభుత్వ కార్యాల యాలను ఏర్పాటు చేసి పోస్టులను మంజూరు చేసిన ప్పటికీ, పోలీస్‌స్టేషన్ మంజూరు చేయలేదు. జూలపల్లి మండల పోలీస్‌స్టేషన్ పరిధిలోనే ఇన్నాళ్లు కొనసా గింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా పెద్దపల్లి జిల్లా 14 మండ లాలతో ఏర్పాటైంది. రామగుండం మండలాన్ని రామ గుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాలుగా, కమా న్‌పూర్ మండలాన్ని కమాన్‌పూర్, రామగిరి మండలా లుగా ఏర్పాటు చేశారు. అంతర్గాం, రామగిరి మండ లాల్లో అన్ని శాఖల కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్లను కూడా మంజూరు చేశారు. బసంత్‌నగర్‌లో పోలీస్ స్టేషన్ ఉండడంతో అది పాలకుర్తి మండల పరిధిలోనికి వచ్చింది. ఎలిగేడు మండలానికి గత ప్రభుత్వం పోలీస్‌స్టేషన్ మంజూరు చేయ లేదు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పెరగడంతో అనధికారికంగా ట్రాఫిక్ స్టేషన్ కొనసాగుతున్నప్పటికీ, కొత్తగా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌తోపాటు మహిళా పోలీస్‌స్టేషన్, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డికి విన్నవించారు. దీంతో గతేడాది డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లిలో జరిగిన సీఎం సభకు ముందు రోజే ఒకేసారి నాలుగు పోలీస్‌స్టేషన్లతో పాటు ఇతర అభి వృద్ధి పనులకు ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతానికి సొంత భవనాలు లేకపోగా తాత్కాలిక భవనాల్లో స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఎలిగేడు స్టేషన్ ఒక హాస్టల్ భవనంలో, ట్రాఫిక్ స్టేషన్ కలెక్టరేట్‌లోని డీసీపీ కార్యాలయం ఆవరణలో గల స్టేషన్‌లో, పెద్దపల్లి రూరల్ స్టేషన్ కలెక్టరేట్‌కు ఎదురుగా గల ఒక అద్దె భవనంలో, మహిళా పోలీస్ స్టేషన్ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో డివి జన్ వ్యవసాయ కార్యాలయ భవనాన్ని ఆఽధునీకరించి ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్డు, జెండా చౌరస్తాలో గల పాత కూరగాయల మార్కెట్ ఆవరణలో 4 కోట్ల 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న సమీకృత కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ, అది అర్థంత రంగా నిలిచిపోయింది. అక్కడ మార్కెట్ నిర్మాణాన్ని వ్యాపారులు, కూరగాయల రైతులు వ్యతిరేకించారు. పట్టణంలో జనాభా మరింత పెరిగే అవకాశాలున్నం దున భవిష్యత్‌లో దానిని పూర్తి చేసి రెండవ కూరగా యల మార్కెట్‌గా సద్వినియోగం చేసుకునే అవకా శాలు లేకపోలేదు.
ఫ ఆరేళ్ల కల నెరవేరనున్న వేళ..
పెద్దపల్లి పట్టణంలోని చందపల్లిలో 196, రాం పెల్లిలో 288 డబుల్ బెడ్ రూముల ఇళ్లు పూర్తి కావ డంతో ఆరేళ్లుగా వాటిపై లబ్ధిదారులు పెట్టుకున్న కల నెరవేరనున్నది. ఆరేళ్ల క్రితం ఈ డబుల్ బెడ్ రూముల ఇళ్లు ఆరంభం అయ్యాయి. భవనాలు పూర్తయినప్పటికీ, మౌలిక వసతులు కల్పించక రెం డేళ్లుగా అవి నిరుపయోగంగా ఉన్నాయి. వీటిలో రోడ్లు, మురికి కాలువలు, వీధి లైట్లు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు సుమారు 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు.
ఫ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..
నూతనంగా ఆరంభం కానున్న పోలీస్ స్టేషన్లు, డబుల్ బెడ్ రూముల ఇళ్ల వద్ద ఏర్పాట్లను కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఆర్‌డీఓ గంగయ్య, తదితరులు పరిశీలించారు. శుక్రవారం జరగనున్న కార్యక్రమాలకు ఉదయం 10 గంటలకు ఎలిగేడు పోలీస్ స్టేషన్, 10:50 గంటలకు పెద్దపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్, 11:10 గంటలకు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, 11:30 గంటలకు మహిళా పోలీస్‌స్టేషన్, 11:50 గంటలకు ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ నిర్మాణానికి, మధ్యాహ్నం 12:20 గంటల నుంచి చందపల్లి, రాంపెల్లి డబుల్ బెడ్ రూముల ఇళ్ల సముదాయాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరంభించనున్నారని కలెక్టర్ పేర్కొ న్నారు. మధ్యాహ్నం 12:20 గంటల నుంచి 1:40 గంటల వరకు చందపల్లి డబుల్ బెడ్ రూముల ఇళ్ల వద్ద సభ జరగనున్నదని పేర్కొన్నారు.
03 పీడీపీఎల్‌టౌన్, జూన్ 07:
కొత్త పోలీస్‌స్టేషన్ల పోలీసు అధికారులు
పెద్దపల్లిటౌన్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): కొత్త పోలీస్‌స్టేషన్లకు సీపీ అంబర్‌కిషోర్ ఝా అధికారులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా పోలీస్‌స్టేషన్‌కు సీఎస్‌బీ రామగుండంలో ఉన్న సర్కిల్ ఇస్స్‌పెక్టర్ పురుషోత్తం, ఎస్సైగా వీఆర్ రామగుండంలో ఉన్న అశోక్‌రెడ్డి, పెద్దపల్లి ఎస్సై2 గా విధులు నిర్వర్తిస్తున్న బుద్దె మల్లేష్ రూరల్ ఎస్సైగా, వీఆర్ రామగుండంలో ఉన్న ఎస్సై సత్యనారాయణ ఎలిగెడ్ ఎస్సైగా నియమించారు. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇది వరకే కొనసాగుతుండగా ఇన్స్‌పెక్టర్ అనిల్‌కుమార్, ఎస్సైలు సహదేవ్‌సింగ్, రవి కాంత్‌లు విధుల్లో ఉండనున్నారు.
Updated Date - Jun 13 , 2025 | 12:54 AM