peddapally : తాగునీటి కష్టాలకు చెక్...
ABN, Publish Date - Jun 23 , 2025 | 12:31 AM
కోల్‌సిటీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థలో నిరంతర నీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. నగరంలో మంచినీటి సరఫరా మెరుగుపరి చేందుకు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) నుంచి రూ.88.9కోట్లు మంజూర య్యాయి.
రామగుండంలో నిరంతర నీటి సరఫరాకు చర్యలు
రూ.88.9కోట్ల యూఐడీఎఫ్ నిధుల మంజూరు
7ఓవర్ హెడ్ ట్యాంకులు, 84కిలోమీటర్ల పైప్‌లైన్లు
ఎన్‌టీపీసీలో 24/7 నీటి సరఫరాకు ప్రణాళికలు
కోల్‌సిటీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థలో నిరంతర నీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. నగరంలో మంచినీటి సరఫరా మెరుగుపరి చేందుకు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) నుంచి రూ.88.9కోట్లు మంజూర య్యాయి. ఈ నిధులతో నగరంలో నీటి సరఫరా ఇబ్బం ది ఉన్న ప్రాంతాల్లో ఏడు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించనున్నారు. కార్పొరేషన్‌లో కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అక్బర్‌నగర్, లింగాపూర్ గ్రామ పంచాయతీ, వెంకట్రావ్‌పల్లి, ఎల్కలపల్లి గేట్ పంచా యతీలు విలీనమయ్యాయి. పట్టణంలో మంచినీటి కొరత ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే 30ఏళ్ల జనాభాకు సరిపడా నీటి సరఫరా చేసేలా ప్రతిపాద నలు తయారు చేశారు.
ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో 13ఓవర్ హెడ్ ట్యాంకులు 15,900 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్నాయి. మొత్తం 13జోన్‌లలో నీటి సరఫరా చేస్తున్నారు. గతంలో రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగగా ఇప్పుడు రోజు నీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. కనీసం గంట పాటు నీటి సరఫరా చేయాలని భావిస్తున్నా ఓవర్‌హెడ్ ట్యాంకుల సామర్థ్యం లేకపోవడంతో 30నిమిషాల వర కు మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో కొత్తగా ఏడు ఓవర్‌హెడ్ ట్యాంకులు, 16.5కిలోమీటర్ల ఫీడర్ మెయిన్, 68 కిలోమీటర్ల డిస్ర్టిబ్యూషన్ లైన్లను ప్రతిపాదించారు. 30ఏళ్ల కితం వేసిన పైప్‌లైన్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంతోపాటు కొత్త వాటర్ ట్యాంకుల పరిధిలో పైప్‌లైన్ల నిర్మాణం జరుగనున్నది
ఏడు కొత్త ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం
కార్పొరేషన్ ప్రజల అవసరాలకు సరిపడా నీరు అందించేందుకు ఏడు కొత్త ట్యాంకులు అవసరమని ప్రతిపాదించారు. కొత్తగా విలీనమైన లింగాపూర్‌తో పాటు పట్టణంలోని డివిజన్లలో మంచినీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2038జనాభా అవసరాలకు అనుగుణంగా 23940 కిలోలీటర్ల కెపాసిటీతో ప్రతీ ట్యాంకు రెండు సార్లు నింపేలా ప్రతిపాదనలు చేశారు. రామగుండం పట్టణంలో బీ పవర్‌హౌస్ ట్యాంకు నుంచే నీటి సరఫరా జరుగుతుంది. దీంతో అదనంగా ఎస్‌టీ కాలనీ ప్రాంతంలో వెయ్యి కిలోలీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నిర్మించనున్నారు. లింగాపూర్ రహదారిలో 700కిలోలీటర్ల సామర్థ్యం గల మరో ఓవర్‌హెడ్ ట్యాం కు నిర్మించనున్నారు. శారదానగర్‌లో 2400కిలో లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు ఉంది. పవర్‌హౌస్‌కాలనీ లేదా మెడికల్ కళాశాల ప్రాంతంలో కొత్తగా 1300కిలో లీటర్ల సామర్థ్యంలో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించనున్నారు. దీంతో ఐబీ కాలనీ, పవర్‌హౌస్‌కాలనీ తదితర ప్రాంతాల కు నీటి సరఫరా ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం ఉన్న సీఎస్‌సీ కాలనీ ట్యాంకుకు మరో 800కిలో లీటర్ల ట్యాంకు నిర్మించనున్నారు. అశోక్‌నగర్ ట్యాంకు పరిధిలో మరో 800కిలో లీటర్ల ఓవర్‌హెడ్ ట్యాంకు, మెటర్నిటీ ట్యాంకు పరిధిలో 1500కిలో లీటర్లసామర్థ్యం గల ట్యాంకును నిర్మిస్తారు. సంజయ్‌గాంధీనగర్‌లో ప్రస్తుతం ఉన్న 1200కేఎల్ ట్యాంకు అదనంగా 1800కేఎల్ ట్యాంకును నిర్మిస్తారు. దీంతో శాంతినగర్, గౌతమినగర్, కాశిపల్లి వరకు నీటి సరఫరాకు ఇబ్బందులు ఉండవు. అల్లూ రులో కూడా మరో 600కేఎల్ సామర్థ్యం గల ట్యాం కును నిర్మించనున్నారు. కొత్తగా 900కేఎల్‌ల సామర్థ్యం గల ట్యాంకుల నిర్మాణం జరుగనున్నాయి.
84కిలో మీటర్ల పైప్‌లైన్ల నిర్మాణం
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీటి సరఫరా మెరుగుకు 16.5కిలో మీటర్ల ఫీడర్ మెయిన్లతో పాటు 68కిలోమీటర్ల డిస్ర్టిబ్యూషన్ లైన్ల నిర్మాణం జరుగనున్నది. డీఐ, హెచ్‌డీపీఈ లైన్లను వేయను న్నారు. రామగుండం పట్టణంతోపాటు కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, శివారు గ్రామాల్లో పైప్‌లైన్ నిర్మాణం జరుగనున్నది. ముఖ్యంగా కొత్తగా నిర్మిస్తున్న ట్యాంకుల పరిధిలో కనెక్షన్లను విభజించనున్నారు. లీకే జీలు లేకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు.
15400 కొత్త కనెక్షన్లు
పట్టణంలో 15400కొత్త కనెక్షన్లను ఇవ్వనున్నారు. ఇందుకు గాను 7.72కోట్లు వ్యయం చేస్తారు. అలాగే 35 చోట్ల బల్క్ ఫ్లో మీటర్లను ఏర్పాటు చేస్తారు. కొత్తగా స్కాడ సిస్టంను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ట్యాంకులు నిండిన సమయంలో ఆటోమేటిక్‌గా ఫీడర్ మెయిన్‌లు ట్రిప్ అవుతాయి.
24గంటల మంచినీటి సరఫరాకు రూ.2.63కోట్లు
ఎన్‌టీపీసీ హెలీప్యాడ్ ట్యాంకు పరిధిలో 2.63కోట్ల వ్యయంతో 24/7 మంచినీటి సరఫరా చేయనున్నారు. 1700కిలోలీటర్ల సామర్థ్యం గల ఈ ట్యాంకు పరిధిలో అభివృద్ధి చెందిన కాలనీలు ఉన్నాయి. ప్రతి కనెక్షన్‌కు మీటర్లు బిగించి అవసరానికి అనుగుణంగానే నీటి వాడకం జరిగే ఏర్పాటు చేస్తారు.
Updated Date - Jun 23 , 2025 | 12:31 AM