ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదేశాలు సరే.. నిధులేవీ..?

ABN, Publish Date - Jun 21 , 2025 | 01:05 AM

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేం దుకు చేపట్టాల్సిన పారిశుధ్య నిర్వహణ, శుద్ధ జలం సరఫరా చేసేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో గ్రామ పంచాయతీ కార్య దర్శులు తలలు పట్టుకుంటున్నారు.

- పంచాయతీలను వేధిస్తున్న నిధుల కొరత

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయని నిధులు

- వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు

- తలలు పట్టుకుంటున్న కార్యదర్శులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేం దుకు చేపట్టాల్సిన పారిశుధ్య నిర్వహణ, శుద్ధ జలం సరఫరా చేసేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో గ్రామ పంచాయతీ కార్య దర్శులు తలలు పట్టుకుంటున్నారు. పంచాయతీరాజ్‌ చట్టం 2018 సెక్షన్‌ 52 ప్రకారం పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యం, రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలల పాటు పారిశుధ్య లోపం, కలుషిత నీటి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. పంచాయతీల్లో నిధులు లేక సతమతం అవుతున్న కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు ఈ పనులు చేసేది ఎట్లా అని మదన పడుతున్నారు. ఏడా దిన్నర కాలంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికా రుల పాలన నడుస్తున్నది. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఎస్‌ఎఫ్‌సీ నిధులను విడుదల చేయక పోవడంతో పంచాయతీల్లో పనులు మందుకు సాగడం లేదు. పెండింగ్‌ బిల్లులు విడుదల కాక కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా పంచాయతీల పేరిట కాగితాల్లో నిల్వ ఉన్న నిధులను సద్వినియోగం చేసుకునేందుకు కార్యదర్శులు చెక్కులు రాస్తున్నా కూడా రెండేళ్లుగా ఆ బిల్లులు పాస్‌ కావడం లేదని చెబుతు న్నారు. 50 వేల రూపాయలలోపు గల చిన్న చిన్న బిల్లులే ఐదారు నెలల్లో పాస్‌ అవుతున్నాయని, అంతకు మించితే పాస్‌ కావడం లేదని తెలుస్తున్నది.

ఫ పారిశుధ్య నిర్వహణ ఇలా..

మురికి కాలువల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూడడం, దోమలు వృద్ధి చెందకుండా శుభ్రం చేయా లని, రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని డంపింగ్‌ యార్డుకు ఎప్పటికప్పుడు తరలించాల్సి ఉంటుంది. మురికి కాలు వలు, గుంతలలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలి. తాగునీటి పైపులైన్ల లీకేజీని అరికట్టి పబ్లిక్‌ నల్లాలు, చేతి పంపుల వద్ద నీటిని నిల్వ లేకుండా చూడాలి. డ్రేడేని పాటిస్తూ హోటళ్లు, మాంసం మార్కెట్లు, చిరు తిండి అమ్మే బండ్లు, దుకాణాల్లో నిల్వ ఉంచే వస్తువులపై జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొల గించడంతోపాటు ఆయిల్‌ బాల్స్‌ వేయాలి. రోజు ఫాగింగ్‌ చేయించాలి. ట్యాంకులను క్లోరినేషన్‌ చేయిం చాలని ప్రభుత్వం పేర్కొంది.

ఫ ప్రజలకు అవగాహన కల్పించాలి

ప్రజలు అంటువ్యాధుల బారిన, జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కాచి వడబోసిన నీటిని తాగాలి. మలవిసర్జనకు మరుగుదొడ్లనే వాడాలి. నివాస ప్రాంతాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుధ్యం పాటించేలా చూడాలి. ఖాళీ డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీటి నిల్వ ఉండే పాత్రలు, తొట్టెలు, ట్యాంకులు, డ్రమ్ములు, బకెట్లపై మూతలు ఉంచాలి. దోమ తెరలు, దోమలను పారదోలే పరికరాలను ఉపయోగించాలి. భోజనానికి ముందు, మలవిసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మూతలు ఉన్న ఆహార పదార్థాలనే తినాలి. ఉరుములు, మెరుపుల సమయంలో తీసుకొనే జాగ్రత్తలపై ప్రజలకు సామూహిక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలని పేర్కొ న్నారు. అతిసార, డెంగ్యూ, వైరల్‌ జ్వరాలు వస్తే వెంటనే ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేయాలి. వారి సహకారంతో ఓఆర్‌ఎస్‌ ద్రావణ ప్యాకెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలి. మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేయాలి. ఆరోగ్య శాఖ సహకారంతో వ్యాధుల నివా రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వర్షాకాలంలో చేపట్టే పనులకు నిధులు లేవని చెబుతున్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌ కొను గోలు, ఫాగింగ్‌ యంత్రాలను సమకూర్చుకోవడం, గుంతలు పూడ్చేందుకు కావాల్సిన మెటీరియల్‌, వీధి లైట్లు కొనుగోలు, ట్రాక్టర్లకు డీజిల్‌ డబ్బులు లేవని, తాగునీటి పైప్‌లైన్ల మరమ్మతు, తదితర పనులకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి పంచాయతీకి లక్ష నుంచి 5 లక్షల వరకు నిధులను కేటాయిస్తే సీజనల్‌ వ్యాధులు, అంటు వ్యాధుల బారి నుంచి ప్రజలను రక్షించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jun 21 , 2025 | 01:05 AM